అసిస్టెంట్‌గా ఉంటానని అడిగా.. మహేష్‌ను నవ్వుల్లో ముంచెత్తిన విజయ్ దేవరకొండ
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. ఈ సినిమాకు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

మహేష్ సినిమా కోసం కష్టపడ్డాను
మహేష్ బాబు మాదిరిగానే యంగ్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండాలని కోరుకొంటున్నాను. టికెట్ల కోసం కష్టపడిన వరస్ట్ మూమెంట్లు ఉన్నాయి. విరక్తి వచ్చే వరకు చెత్త అనుభవాలు ఉన్నాయి. బెస్ట్ మూమెంట్ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే. సెక్యూరిటీ తీసుకొచ్చి కంఫర్ట్‌గా కూర్చొపెట్టారు. మహేష్ చెప్పిన డైలాగ్స్‌లో నాకు చాలా ఇష్టమైనవి ఉన్నాయి. వాటిని స్టేజ్ మీద నుంచి అందరితో చెప్పిస్తాను.

రెండు రోజులు అసిస్టెంట్‌గా ఉంటానని
మహేష్ బాబు అంత స్లిమ్‌గా, స్మార్ట్‌గా ఉండటానికి ఏమి తింటారో అని తెలుసుకొనేందుకు ప్రయత్నించాను. మహర్షి సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు నేను రెండు రోజులు అసిస్టెంట్‌గా ఉంటానని అడిగాను. అయితే ఎప్పుడూ నవ్వినట్టే నవ్వి ఊరుకొన్నారు. వంశీ పైడిపల్లిని అడిగితే ఇంటి నుంచి టిఫిన్ వస్తుందని చెప్పాడు.

అంతా టిఫిన్ బాక్స్‌లోనే
మహర్షి సినిమా జరిగేటప్పుడు వంశీ పైడిపల్లి కూడా స్లిమ్ అయ్యాడు. అంతా టిఫిన్ బాక్స్‌లోనే ఏదో ఉండి ఉంటుందనుకొంటాను. రెండు రోజులు తిరిగితే కానీ అందులో ఏముంటుందో తెలియదు అని విజయ్ దేవరకొండ అంటుండగా.. ప్రిన్స్ మహేష్ బాబు నవ్వుల్లో మునిగిపోయాడు. విజయ్ దేవరకొండ మాట్లాడేంత సేపు చిరునవ్వుతోనే కనిపించాడు.

మే 9వ తేదీన రిలీజ్
మే 9వ తేదీన రిలీజ్ కానున్న మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











