Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్‌ను సార్ అనాలంటే ఇబ్బంది... అప్పుడు మాస్ జనాలు తొక్కేశారు.. ప్రిన్స్ ట్వీట్‌తో గాలిలో తెలిపోయా
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. ఈ సినిమాకు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
కాలేజీ డేస్ నుంచే మహేష్ ఫ్యాన్‌ను
నేను కాలేజీలో ఉన్నప్పడు నేను మహేష్ బాబు ఫ్యాన్స్‌ను. నేను ఈ రోజు మహేష్ బాబు ఫ్యాన్‌గా వచ్చాను. ఆయనకు ఎప్పుడు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అని పిలుచుకొనే వాళ్లం. యాక్టర్‌ను అయ్యాక సర్ అని పిలువాల్సి వస్తుంది. ఇది ఇబ్బందిగా ఉంది. మావోడు అనుకొనే వాళ్లం. మహేష్ సినిమాలు చూడటానికి ఎంత కష్టపడే వాడినో నాకే తెలుసు అని విజయ్ దేవరకొండ అన్నారు.
మాస్ జనాలు తోసేసుకుంటూ
మహేష్ బాబు మురారి సినిమాను తొలిసారి చూశాను. అమ్మ, నాన్నతో కలిసి దిల్షుక్ నగర్ కోణార్క్ థియేటర్లో చూసేవాడిని. మహేష్ బాబు సినిమాలు చూడటానికి గంటముందు థియేటర్ గేట్ బయట ఉండేవాడిని. గేట్ తీయగానే దిల్ షుక్ నగర్ మాస్ జనాలు తోసేసి.. తొక్కేసుకొంటూ వెళ్లే వాళ్లు. మహేష్ బాబు సినిమాలు చూడటానికి ఓ ప్లాన్ వేశాను. లేడీస్ క్యూలో తక్కువ మంది ఉంటారని గ్రహించి.. మా అక్కనో.. కజిన్స్నో తీసుకెళ్లేవాడిని. అలా మహేష్ బాబు సినిమాలు చూసే వాడిని.
లైఫ్ అంటే అలా ఉండాలని
మొదటిసారి థియేటర్ బిగ్ స్క్రీన్ మీద మహేష్‌ను చూశాను. యాక్టర్ అయ్యాక నేను అవార్డు ఫంక్షన్లో చివరి వరుసలో ఉండి చూశాను. మహేష్ సర్ రాగానే అందరూ లేచి విష్ చేయడం చూసి ఏదో రోజు నాకు కూడా అలాంటి స్టేటస్ వస్తే బాగుండు అని అనుకొన్నాను. లైఫ్ అంటే అలా ఉండాలని కోరుకొన్నాను.
మహేష్ ట్వీట్ చేస్తే గాలిలో తెలిపోయాను
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు చేసినప్పుడు మహేష్ సర్ నా సినిమాల గురించి ట్వీట్ చేసేవారు. పెళ్లిచూపులు సినిమా అప్పుడు మహేష్ ట్వీట్ చేసి తరుణ్ భాస్కర్ గురించి.. నా గురించి ట్వీట్లో చెప్పారు. దాంతో నేను గాలిలో తేలిపోయాను. మహేష్‌కు నచ్చే సినిమాలు చేస్తానని మాటిస్తున్నాను.
నా బర్త్ డే రోజున మహర్షి మూవీ రిలీజ్
మహర్షి సినిమా మే 9వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఆ రోజు నా బర్త్ డే. ఆ రోజు సినిమా రిలీజ్ అవుతున్నందున నాపై ప్రెజర్ పెరుగుతున్నది. ఎలాగైనా మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. వంశీ పైడిపల్లికి మంచి సక్సెస్ దక్కుతుంది అని విజయ్ దేవరకొండ అన్నారు.