రెండు నెలలు ఆలస్యమైతే, మరో హీరో వద్దకు... మహేష్ బాంబు వేసింది ఆ డైరెక్టర్‌పైనేనా?

Recommended Video

Mahesh Babu Takes A Veiled Dig At Sukumar? || Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేష్ బాబు వీలైనంత వరకు వివాదాలకు దూరంగానే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అనవసరపు విషయాల్లో జోక్యం కలుగజేసుకోవడం అసలే కనిపించదు. కెరీర్, కుటుంబం తప్ప మిగితా విషయాలను పెద్దగా పట్టించుకోవడం తక్కువే. ప్రస్తుతం శ్రీమంతుడు.. భరత్ అనే నేను సినిమాల తర్వాత మహర్షితో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు నెలలు ఆలస్యమైతే, మరో హీరో వద్దకు వెళ్తారు అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వివరాలకు వెళితే...

 సుకుమార్‌తో సినిమా చేయాలని

సుకుమార్‌తో సినిమా చేయాలని

వాస్తవానికి మహర్షి సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్‌తో మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ చేయాల్సింది. రంగస్థలం తర్వాత సుకుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో ప్రిన్స్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత స్టోరీ డెవలప్ చేసిన తర్వాత మహేష్ మార్పులు అడిగినట్టు, అలాగే మరో కథను రెడీ చేయాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి.

అల్లు అర్జున్ వద్దకు సుకుమార్

అల్లు అర్జున్ వద్దకు సుకుమార్

ఈ క్రమంలో తన ప్రాజెక్ట్‌కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా నాన్చుతుండటంతో సుకుమార్ అల్లు అర్జున్‌కు అదే కథ చెప్పి ఓకే చెప్పించుకోవడం జరిగిందనేది సినీ వర్గాల్లో టాక్ నడించింది. ఆ వెంటనే అల్లు అర్జున్‌తో సుకుమార్ సినిమా అనౌన్స్ చేయడంతో ఆ వార్తలకు బలం చేకూరాయి. మీడియాలో వార్తలు వైరల్ కావడంతో సుకుమార్ గురించి మహేష్ ట్విట్టర్‌లో స్వయంగా స్పందించారు.

సుకుమార్ గురించి మహేష్ బాబు

సుకుమార్ గురించి మహేష్ బాబు

సుకుమార్, తన ప్రాజెక్ట్ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. సుకుమార్ గొప్ప దర్శకుడు. తనపై నాకు మంచి రెస్పెక్ట్ ఉందని మహేష్ క్లారిటీ ఇచ్చాడు. దాంతో సుకుమార్‌తో వివాదానికి, రూమర్లకు మహేష్ తెర దించారు. దాంతో ఆ సమస్య ముగిసిపోయింది.

 వంశీ పైడిపల్లిని వెనుకకు పంపిద్దామని

వంశీ పైడిపల్లిని వెనుకకు పంపిద్దామని

ఇక మహర్షి ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు 10 నిమిషాలు స్టోరీ విని వంశీ పైడిపల్లిని వెనక్కు పంపిద్దామని అనుకొన్నాను. నాకు వరుసగా రెండు ప్రాజెక్టులు చేయాల్సి ఉండటంతో వంశీతో సినిమా కుదరదు అని అనుకొన్నాను. కానీ 20 నిమిషాల కథ విన్న తర్వాత సినిమా చేస్తానని చెప్పాను. కాకపోతే 2 సంవత్సరాలు ఆగాలని చెప్పాను అని మహేష్ వివరించాడు.

నా కోసం వెయిట్ చేయడం నిజంగా

నా కోసం వెయిట్ చేయడం నిజంగా

మహర్షి సినిమాను తనతోనే తీయడానికి రెండేళ్లు ఆగిన వంశీ పైడిపల్లికి చాలా థ్యాంక్స్. రెండు నెలలు ఆలస్యమైతే దర్శకులు కథను పట్టుకొని మరో హీరో వద్దకు వెళ్లే ఈ రోజుల్లో... నిజంగా నా కోసం వంశీ వెయిట్ చేయడం అభినందనీయం. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అని మహేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సుకుమార్‌ను మనసులో పెట్టుకొని చేశారా అనే చర్చ మీడియాలో విస్తృతంగా జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X