8 Years For Aagadu: సినిమా ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ రికార్డులు మాత్రం నెవ్వర్ బిఫోర్.. మహేష్ కెరీర్ బెస్ట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. సరైన డైరెక్టర్ పడితే మాత్రం ఆ హడావిడి అంతకుమించి అనేలా ఉంటుంది. దూకుడు తో బాక్సాఫీస్ హిట్ సక్సెస్ చూసిన శ్రీనువైట్ల మహేష్ బాబు ఇద్దరు మరోసారి ఆగడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2014 సెప్టెంబర్ 19వ తేదీన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అప్పటివరకు అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఇక నేటితో ఆ సినిమా విడుదలై సరిగ్గా 8 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఆగడు సినిమాకు సంబంధించిన ఓపెనింగ్స్ ఫస్ట్ డే రికార్డులను షేర్ చేసుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి రోజు

మొదటి రోజు

ఆగడు ప్రీమియర్స్ తోనే అమెరికాలో ఊహించని విధంగా ఓపెనింగ్స్ అందుకుంది. అప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ప్రీమియర్ షోల ద్వారా 500 కే డాలర్స్ అందుకుంది లేదు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం అప్పటివరకు టాలీవుడ్లో అదే అధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. అలాగే అప్పటి వరకు నైజాం డే వన్ రికార్డును కూడా బ్రేక్ చేయడం విశేషం.

100 అడుగుల కటౌట్

100 అడుగుల కటౌట్

అభిమానుల్లో అప్పట్లో హాట్ టాపిక్ గా మహేష్ బాబు కటౌట్ నిలిచింది. సాధారణంగా స్టార్ హీరోలకు అభిమానులు పోటీపడుతూ అతిపెద్ద కటౌట్స్ నిర్మిస్తూ ఉంటారు. ఇక గతంలో ఎప్పుడు లేనంతగా 100 అడుగుల కటౌట్ ను నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఆ కటౌట్ తో మరోసారి రుజువయింది. ఒక విధంగా ఆ రోజుల్లో ఆగడుకు వచ్చిన హంగామా అంతా ఇంకా కాదు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ మరొక రేంజ్ లో ఉండేవి అని చెప్పవచ్చు.

 మహేష్ బాబు కామెడీ టైమింగ్

మహేష్ బాబు కామెడీ టైమింగ్

ఇక ఆగడు సినిమాలో మహేష్ బాబు నటించిన విధానం కూడా అప్పట్లో అభిమానులను చాలా బాగా మెప్పించింది. ఫస్ట్ అఫ్ మొత్తంలో కూడా నాన్ స్టాప్ గా కామెడీ పంచ్ డైలాగ్స్ తో మహేష్ బాబు ఎంతగానో మెప్పించాడు. ఇక సెకండ్ హాఫ్ లో కాస్త బోరింగ్ గా అనిపించడంతో సినిమా రిజల్ట్ మారిపోయింది. ఏదేమైనా కూడా ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించడం ఫ్యాన్స్ కు మాత్రం చాలా బాగా నచ్చింది.

ఆల్ టైమ్ రికార్డ్స్

ఆల్ టైమ్ రికార్డ్స్

ఆగడు మొదటి రోజు రికార్డులు చూసుకుంటే మాత్రం వరల్డ్ వైడ్ గా అప్పట్లో అత్యధికంగా 18 కోట్ల కలెక్ట్ చేసిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సౌత్ మొత్తంలో కూడా అదే హైయెస్ట్ ఓపెనింగ్స్. ఇక యూఎస్ ప్రీమియర్ షోల ద్వారా కూడా నేషనల్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ అవ్వగా కర్ణాటకలో కూడా అదే తరహాలో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఒంగోలు భీమవరం టౌన్ లలో కూడా పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఏరియాలలో కూడా ఆగడు సినిమా ఫస్ట్ డే గతంలో ఎప్పుడూ లేనంత భారీగా ఓపెనింగ్స్ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X