సితారకు అలాంటి సీన్స్ అస్సలు నచ్చవు.. ఆ సీన్స్ వస్తే లేచి వెళ్లిపోతుంది: మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై తన స్టార్ హోదాను ఎంత పెంచుకున్న కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అతను టాలీవుడ్ బెస్ట్ ఫ్యామిలీ మెన్ అని కూడా చెప్పవచ్చు. వీలైనంత ఎక్కువ సమయాన్ని తన పిల్లలతోనే గడుపుతూ ఉంటాడు. బాహ్య ప్రపంచంలో కూడా వారికి సంబంధించిన కొన్ని ఆనందమైన క్షణాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల మహేష్ బాబు కూతురు సితార గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

కాంట్రవర్సీలకు దూరంగానే

కాంట్రవర్సీలకు దూరంగానే

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదా ను సంపాదించుకున్న మహేష్ బాబు ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో తప్పితే మరే ఇతర విషయాలపై పెద్దగా ఫోకస్ పెట్టారు. వీలైనంతవరకు కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటారు ఇక అవసరమైన సమయాల్లో సాధారణ జనాలకి ఉపయోగ పడేలా మంచి కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు.

చిన్నారులకు అండగా..

చిన్నారులకు అండగా..

మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు దేవుడిలా నిలుస్తున్నాడు. 1000 మందికి పైగా పసి హృదయాలు కు ఆపరేషన్ చేయించి వారి ప్రాణాలకు ఆరో ప్రాణంలా నిలుస్తున్నాడు. ఆ విషయంలో మహేష్ అభిమానుల నుంచి భారీ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా అభిమానులతో చాలా సున్నితంగా ఉండే అతి కొద్ది మంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు.

అలాంటి సీన్స్ నచ్చవు

అలాంటి సీన్స్ నచ్చవు

అందరు హీరోలు కలిసి ఉండాలి అలాగే అభిమానులు కూడా కలిసి ఉండాలి అనే విధంగా మహేష్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇటీవల మహేష్ బాబు తన కూతురు సితార గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని కూడా చెప్పాడు. ఆమెకు సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఏమాత్రం నచ్చవట. అలాంటి సీన్స్ వచ్చాయి అంటే అక్కడి నుంచి వెళ్లి పోతుంది అని మహేష్ చాలా ఓపెన్ గా తెలియజేశాడు.

యాక్షన్ సన్నివేశాలు వస్తే..

యాక్షన్ సన్నివేశాలు వస్తే..

సితార కు మంచి సినిమాలు చూడడం అంటే చాలా ఆసక్తి ఉంటుంది. కానీ ఆమెకు ఏ సినిమాలో అయినా సరే యాక్షన్ సన్నివేశాలు వస్తే మాత్రం అక్కడి నుంచి వెళ్లి పోతుంది అని మహేష్ తెలియజేశాడు. ఇక గతంలో F2 లాంటి చిత్రాలను ఆ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు మహేష్ తెలియజేశాడు. ఆమెకు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే బాగా ఇష్టం అని కూడా వివరణ ఇచ్చాడు.

త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై సితార

త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై సితార

సితార వెండితెరపై కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాలో సితార ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు ఇటీవల టాక్ అయితే గట్టిగానే వచ్చింది. మరి ఆ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆ ప్రాజెక్ట్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే. ఆ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X