వారసుడి కోసం మహేష్ బాబు సీక్రెట్ ప్లాన్.. హీరోగా గౌతమ్ ఎంట్రీ ఎప్పుడంటే?
సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎవరైనా సరే మొదట హీరోగానే వారి అడుగు పడాలని కోరుకుంటారు. సినీ పరిశ్రమలో చాలా మంది కొడుకు పుడితే హీరోగా చూసుకోవలని అనుకుంటారు. ఇకపోతే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా కొడుకును హీరోగా చూసుకోవాలని ఉందని ఆల్ రెడీ ఒక సినిమాతో చెప్పేశాడు. గౌతమ్ ఘట్టమనేని ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

గౌతమ్ యాక్టింగ్..
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ బ్రాండ్ బాధ్యతలను గౌతమ్ ఎప్పుడు స్వీకరిస్తాడో గాని.. గత కొంత కాలంగా అతని ఎంట్రీపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. వన్ నేనొక్కడినే సినిమాతోనే గౌతమ్ తన యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెట్టాడు. తండ్రితో సమానంగా పరుగులు తీయడానికి ప్రయత్నం చేశాడు.

లాక్ డౌన్ లో కోచింగ్..
ప్రస్తుతం మహేష్ తన ఇంట్లోనే ఉంటూ తదుపరి సినిమాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడు. అయితే అప్పుడప్పుడు సరదాగా మహేష్ తన కొడుకు చేత డైలాగ్స్ చెప్పిస్తున్నాడట. అలాగే యాక్టింగ్ లో కూడా మెళకువలు నేర్పుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి లాగే గౌతమ్ కి చాలా మోహమాటం అని అర్ధమవుతొంది. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం మనోడు చురుగ్గానే ఉన్నాడట.

ఆఫర్స్ వచ్చినా..
వన్ నేనొక్కడినే సినిమా తరువాత గౌతమ్ కి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయట. కానీ అందుకు మహేష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. వీలైనంత వరకు అతని చదువు పూర్తయ్యే వరకు సినిమా ఇండస్ట్రీలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నారట. కానీ యాక్టింగ్ స్కిల్స్ పెరిగేలా మహేష్, నమ్రతలు కలిసి కొడుకుకు సొంతంగా క్లాసెస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఎంట్రీ ఎప్పుడో..
గౌతమ్ వయసు ప్రస్తుతం 13ఏళ్ళు.. అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మరో 10 ఏళ్ళు పట్టవచ్చు. ఇప్పుడే యాక్టింగ్ సైడ్ వెళ్ళనివ్వకుండా మహేష్ జాగ్రత్త పడుతున్నాడు. ఇకపోతే అభిమానులు గౌతమ్ ఎంట్రీ కోసం చాలానే ఏదురుచూస్తున్నట్లు అర్ధమవుతోంది. అతని ఎంట్రీ ఇప్పట్లో ఉండదని తెలిసినా కూడా చిన్న చిన్న పాత్రలతో కనిపిస్తాడేమో అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ మహేష్ మాత్రం డైరెక్ట్ గా హీరోగానే గౌతమ్ ని ఆడియెన్స్ ముందుకు తేవాలని అనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











