Mahesh Babu మహేష్ బాబు హాలీవుడ్ యాక్షన్ రేంజ్ వీడియో రిలీజ్.. చూస్తే గూస్ బంప్స్ పక్కా!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన రాజమౌళితో సినిమా అనౌన్స్ చేశాకా నేషనల్ మీడియా ఫోకస్ మొత్తం మహేష్ బాబు మీదనే పెట్టింది. ఇక దానికి తగ్గట్లుగానే మహేష్ బాబు సైతం రోజుకో ఫోటో షూట్ తన సోషల్ మీడియా వేదికగా వదులుతున్నాడు. ఇక తాజాగా ఓ హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ వీడియోను రిలీజ్ చేశాడు. రాజమౌళితో సినిమా కంటే ముందే ఈ రేంజ్ యాక్షన్ వీడియోనా అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.

ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు క్రేజ్ తో అంతో ఇంతో ఆడింది. కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కథ కూడా ఇప్పటికే పూర్తి అయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సినిమా స్టార్ట్ అవ్వకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu Ad Hollywood Range Action Sequence Video Released Before SSMB 29 Rajamouli Movie Full Details Here

ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా రాజమౌళి సినిమా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ మాత్రం యాడ్స్, ఫోటోషూట్స్ చేస్తూ కాలం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో వరుసగా కొత్త ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక ఆ ఫోటోల్లో మహేష్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఉన్నాయి. ఇక లేడీ ఫ్యాన్స్ మాత్రం బాబు ఏం ఉన్నాడు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు హ్యాండ్సమ్ లుక్స్.. చూసి అసలు అన్నం తింటున్నాడా అందం తింటున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐదు పదుల వయసులోనూ మహేష్ బాబు ఇంత అందం ఎలా సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫోటోషూట్స్ తో పాటు కొన్ని యాడ్స్ షూటింగ్స్ కూడా మహేష్ బాబు పూర్తి చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో అభి బస్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మహేష్ తన కొత్త యాడ్ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ యాడ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ను తలపించేలా ఉంది. మహేష్ బాబు 'మౌంటెన్ డ్యూ' కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మౌంటెన్ డ్యూ యాడ్స్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో యాడ్ చేశాడు. ఈ బ్రాండ్ కి సంబంధించిన కొత్త యాడ్ ని మహేష్ ఆడియన్స్ ముందుకు తీసుకురాగా ఆ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

Mahesh Babu Ad Hollywood Range Action Sequence Video Released Before SSMB 29 Rajamouli Movie Full Details Here

ఈ యాడ్ లోని యాక్షన్ సీన్స్ తో పాటు మహేష్ లుక్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు ఈ యాడ్ లో స్నేహితుడి కోసం చేసే పోరాటాన్ని చూపించారు. ఇక ఇందులో మహేష్ లుక్స్ మాత్రం కేక అని చెప్పవచ్చు. ఈ వీడియో చూస్తే పక్కా గూస్ బంప్స్ అంటున్నారు ఫ్యాన్స్. మీరు ఆ వీడియోను చూడకపోతే ఓ సారి లుక్ వేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X