మహేష్ బాబు ప్లాన్ మాములుగా లేదు.. జక్కన్న రెడీ అయ్యే లోపు మరో రెండు..
సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే ప్రాజెక్టులు నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో రిస్క్ చేయడానికి పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు కమర్షియల్ గా తన సినిమా వల్ల ఎవరు నష్టపోకూడదు అని ఆలోచిస్తాడు. ఇక కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సూపర్ స్టార్ ఇటీవల వెంటవెంటనే రెండు కథలను పూర్తి చేయాలని ఒక డేరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే
మహేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత తొందరగా పూర్తి చెయ్యాలని అనుకుంటాడు. దర్శకులు నిర్మాతలు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మహేష్ ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా కూడా పని చేస్తాడు. గతంలో రెండు మూడు నెలల్లో పూర్తి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. బిజినెస్ మెన్, మహేష్ కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తి చేసిన బిగ్ మూవీ.

కరోనాతో బ్రేకులు
మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా షూటింగ్ కు ఇటీవల కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి.

జక్కన్న రెడీ అయ్యే లోపు
అయితే సర్కారు వారి పాట అనంతరం మహేష్ వెంటవెంటనే మరో రెండు సినిమాలను స్టార్ట్ చేయవచ్చని టాక్. వచ్చే ఏడాది రాజమౌళితో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న రెడీ అయ్యే లోపు తప్పకుండా మరో రెండు సినిమాలను లైన్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే జక్కన్న సినిమాకు కనీసం రెండేళ్ల సమయం పడుతుందట. అందుకే ప్రేక్షకులకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆమె దర్శకత్వంలో కూడా
ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే ఎండ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న మహేష్ ఈ సినిమాతో పాటు సుధ కొంగర సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాడట. వర్కౌట్ అయితే పెద్దగా గ్యాప్ లేకుండానే వచ్చే ఏడాది మహేష్ నుంచి రెండు సినిమాలు రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











