రాజమౌళి ఆలస్యాన్ని ముందే పసిగట్టిన మహేష్.. మరో అడ్వాన్స్ ప్లాన్ రెడీ?
సూపర్ స్టార్ మహేష్ బాబు గత మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకున్నాయి. ముఖ్యంగా సరిలేరి నీకెవ్వరు మహేష్ బాబుకి కమర్షియల్ గా మంచి లాభాలనే అందించింది. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట అనే సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి.
ఇటీవల మహేష్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా RRR అయిపోగానే స్టార్ట్ కావచ్చని అంతా అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఆ ఎఫెక్ట్ మహేష్ ప్రాజెక్టుపై పడనున్నట్లు సమాచారం.

మహేష్ తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాది కూడా సెట్స్ పైకి రావడం కష్టమే అనే టాక్ వస్తోంది. అయితే మహేష్ ఈ విషయంపై ఆలోచించి ముందు జాగ్రత్తగా ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే మినిమామ్ రెండేళ్లయిన సమయం పడుతుంది కాబట్టి సర్కారు వారి పాట తరువాత ఒక తొందరగా పూర్తయ్యే కమర్షియల్ సినిమాను చేయాలని అనుకుంటున్నాడట. అందుకోసం అనిల్ రావిపూడితో మరోసారి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సమయంలోనే వీరి కాంబోలో మరో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక రాజమౌళి RRR ఆలస్యం కారణంతో మహేష్ మరోసారి, అనిల్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











