2021కి నెంబర్ వన్ మహేష్ బాబే.. సెకండ్ బన్నీ..ఆ తరువాత ఎవరంటే.. సర్వే ఫలితాలు వచ్చేశాయ్!

టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ పై ఎప్పటి నుండో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహేష్ - పవన్ కళ్యాణ్ -ప్రభాస్- ఎన్ఠీఆర్ అంటూ ఎవరి అభిమానులు తమ తమ హీరోనే నెంబర్ 1 అంటూ ఆ స్థానం తమదే అని భావిస్తూ ఉంటారు. ఇక మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తుంది. తాజాగా ఈ సర్వే 2021 మొత్తానికి సంబందించిన ఫలితాలు విడుదల చేసింది. ఆ జాబితాలో ఎవరెవరు ఎలా ఉనారు అనే వివరాల్లోకి వెళితే

1-మహేష్ 2-అల్లు అర్జున్

1-మహేష్ 2-అల్లు అర్జున్

పాపులర్ సర్వ్ కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో ఆయన రికార్డు సృష్టించారనే చెప్పాలి. వరుసగా పన్నెండు నెలల నుంచి ఆయనే మొదటి స్థానంలో ఉంటున్నారు. అలా ఏడాది మొత్తానికి ఆయనే నెంబర్ వన్ గా నిలిచారు.

చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా ఏప్రిల్ నెలకు వాయిదా పడింది. ఇక ఈ కేటగిరీలో అల్లు అర్జున్ గత నెలలో నాలుగో స్థానంలో ఉండగా ఇప్పుడు ఏడాది మొత్తానికి గాను ఆయన రెండో స్థానంలో నిలబడ్డాడు. చివరిగా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. హిందీలో కూడా సత్తా చాటాడు.

3-ప్రభాస్ 4- పవన్ కళ్యాణ్

3-ప్రభాస్ 4- పవన్ కళ్యాణ్

ఇక గత నెలలో రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ మళ్ళీ మూడవ స్థానానికి దిగజారారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇవి కాక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ ఐదవ స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకారు.

వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు మాత్రం సెట్స్ మీద ఉన్నాయి.

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

ఎన్టీఆర్ మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి దిగజారారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు.

ఇక ఈ జాబితాలో రామ్ చరణ్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. అలాగే ఆచార్య లో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న రావాల్సి ఉంది కానీ ఏప్రిల్ 1కి వాయిదా పడింది.

7-విజయ్ దేవరకొండ 8-నాని

7-విజయ్ దేవరకొండ 8-నాని

నేచురల్ స్టార్ నాని ఎనిమిదవ స్థానం నుంచి ఏడవ స్థానానికి ఎగబాకారు. గత నెలలో ఆయన ఎనిమిదవ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏడవ స్థానానికి చేరారు. చివరిగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నారు.

ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏడవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానానికి దిగజారారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

9- చిరంజీవి, 10-రవితేజ

9- చిరంజీవి, 10-రవితేజ

ఈ జాబితాలో గత ఏడాది మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి పదవ స్థానాన్ని సాధించారు. చివరిగా ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటించగా ఆ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది, కానీ మళ్ళీ ఏప్రిల్ 1కి వాయిదా వేశారు.

అదొక్క సినిమా కాకుండా ఆయన నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. ఇక రవితేజ గత ఏడాది మొత్తానికి గాను పదవ స్థానం సంపాదించారు. ఇక చివరిగా క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X