Mahesh Babu ను కొట్టేవారే లేరా? వరుసగా 11 నెలలు నెం.1 ఆయనే.. సర్వేలో షాకింగ్ రిజల్ట్స్!

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ నెలకు గాను టాలీవుడ్ లో మోస్ట్ నెంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అయితే ఆ జాబితాలో కొందరి స్థానాలు మాత్రం మారాయి, ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే

Recommended Video

Tollywood Stars Top 10 Rankings : Prabhas మూడు.. Allu Arjun రెండు || Filmibeat Telugu
1-మహేష్ 2-అల్లు అర్జున్

1-మహేష్ 2-అల్లు అర్జున్

పాపులర్ సర్వ్ కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో ఆయన రికార్డు సృష్టించారు. వరుసగా పది నెలల నుంచి ఆయనే మొదటి స్థానంలో ఉంటున్నారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ కేటగిరీలో అల్లు అర్జున్ రెండో స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. చివరిగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది.

3-ప్రభాస్ 4-పవన్ కళ్యాణ్

3-ప్రభాస్ 4-పవన్ కళ్యాణ్

ఇక ఈ జాబితాలో ప్రభాస్ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇవి కాక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమాలు మాత్రం సెట్స్ మీద ఉన్నాయి.

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

ఈ జాబితాలో ఎన్టీఆర్ 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నారు. ఇక ఈ జాబితాలో రామ్ చరణ్ ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకారు.

చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఆచార్య లో కూడా ఆయన నటిస్తున్నారు.

7-నాని 8-విజయ్ దేవరకొండ

7-నాని 8-విజయ్ దేవరకొండ

నేచురల్ స్టార్ నాని ఆరో స్థానం నుంచి ఏడవ స్థానానికి ఎగబాకారు. గత నెలలో ఆయన ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు ఏడవ స్థానానికి చేశారు. చివరిగా టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాతో వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమదవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.

9- నాగచైతన్య, 10-చిరంజీవి

9- నాగచైతన్య, 10-చిరంజీవి

సెప్టెంబర్ నెల జాబితాలో నాగచైతన్య పదో.స్థానం సంపాదించారు. సెప్టెంబర్ 24న లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ పదో స్థానం సంపాదించారు. ఆ తరువాత ఆయన విడాకుల ప్రకటనతో ఒక స్థానం పైకి ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానం నుంచి పదవ స్థానానికి దిగజారారు. ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అదొక్క సినిమా కాకుండా ఆయన నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X