Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాలీవుడ్ నెం.1 మహేష్.. టాప్ టెన్ లో కొత్త పేరు.. షాకిస్తున్న సర్వే ఫలితాలు!
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలకు గాను టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అయితే ఆ జాబితాలో కొందరి స్థానాలు మారాయి, ఏమేం మారాయి అనే వివరాల్లోకి వెళితే
1-మహేష్ 2-అల్లు అర్జున్
పాపులర్ సర్వ్ కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం మళ్ళీ నిలబెట్టుకున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలలో కూడా ఆయన అదే స్థానంలో నిలవగా సెప్టెంబర్ నెలలో కూడ అదే స్థానం సాధించారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు.
ఇక ఈ కేటగిరీలో అల్లు అర్జున్ రెండో స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. చివరిగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది.
3-ప్రభాస్ 4-పవన్ కళ్యాణ్
ఇక ఈ జాబితాలో ప్రభాస్ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇవి కాక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.
5- ఎన్టీఆర్ 6-నాని
ఈ జాబితాలో ఎన్టీఆర్ 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నారు.
ఇక ఈ జాబితాలో నేచురల్ స్టార్ నాని ఆరో స్థానానికి ఎగబాకారు. గత నెలలో ఆయన ఏడో స్థానంలో ఉండగా ఇప్పుడు ఆరుకు చేరింది. చివరిగా టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాతో వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.
7-రామ్ చరణ్ 8-విజయ్ దేవరకొండ
రామ్ చరణ్ ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి దిగజారారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఆచార్య లో కూడా ఆయన నటిస్తున్నారు.
ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమదవ స్థానానికి దిగజారారు. గత నెలలో ఏడవ నెంబర్లో ఉన్న ఆయన ఒక స్థానం దిగజారారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.
Recommended Video
9-చిరంజీవి 10-నాగచైతన్య
ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా కాకుండా ఆయన నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. ఇక సెప్టెంబర్ నెల జాబితాలో నాగచైతన్య స్థానం సంపాదించారు. సెప్టెంబర్ 24న లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ పదో స్థానం సంపాదించారు.