మహేష్ బాబు vs గౌతమ్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎంత పెద్ద స్టార్ డమ్ ఉన్నా కూడా తన పిల్లల దగ్గర ఏ మాత్రం చూపించకుండా ఒక ఫ్రెండ్ లాగా వారితో సరదాగా గడిపేస్తుంటాడు. ఇటీవల నమ్రత వారికి సంబంధించిన ఫొటోలు వీడియోలు పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది.
రీసెంట్ గా మరొక కొత్త వీడియోను పోస్ట్ చేసిన నమ్రత ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చింది. గౌతమ్ అలాగే మహేష్ సరదాగా ఒక కాంపిటీషన్ సెట్ చేసుకున్నారు. ఆ గేమ్ లో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే మహేష్ మొహాన్ని చూసి తనయుడు గౌతమ్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రతిసారి నువ్వు నవ్వెలా చేస్తున్నావ్ అని డ్రాప్ అయిపోయాడు.
View this post on InstagramA post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

అందుకు సంబంధించిన వీడియోను చూసి నెటీజన్స్ కూడా నవ్వును ఆపుకోవడం లేదు. మెమరీ థెరపీ అంటూ నమ్రత రోజుకో వీడియోను పోస్ట్ చేస్తూ నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ పరశురామ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక స్టైలిష్ లుక్ కూడా సెట్ చేసుకున్న సూపర్ స్టార్.. లాక్ డౌన్ అనంతరం కొత్త ప్రాజెక్టును వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











