మహేష్ - కేవీ ఆనంద్ కాంబో..అంతా సెట్ అయ్యాక అలా ఆగిపోయింది!
తొలుత కెమెరామెన్‌గా సినిమా రంగంలోకి ప్రవేశించి తర్వాత దర్శకుడిగా మారిన కె.వి.ఆనంద్ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ముందు ఆయన గుండెపోటుతో మరణించారు అనే వార్త బయటకు వచ్చినా తరువాత ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇక ఆయన మృతికి తమిళ చిత్ర సీమ సహా తెలుగు చిత్రం సీమ కూడా తమ సంతాపం వ్యక్తం చేస్తోంది.
దాదాపు ఆయనతో కలిసి పనిచేసిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన సూర్య అయితే ఆత్మీయుడిని కోల్పోయిన బాధలో ఉన్నారు. అయితే మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ వేదికగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అయితే వాస్తవానికి మహేష్ బాబు- కెవీ ఆనంద్ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. రంగం సినిమా సూపర్ హిట్ అయిన తరవాత.. ఈ కాంబో సెట్ అవ్వాల్సి ఉంది.

ఆ సమయంలో ఆయన కథ కూడా చెప్పారని అంటూ ఉంటారు. మహేష్‌కి కూడా కెవి ఆనంద్ చెప్పిన కధ నచ్చడంతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించారు. అయితే ఏమయిందో ఏమో తెలియదు కానీ ఈ కాంబో సెట్ కాలేదు. వెంటనే అదే సమయంలో ఆయన సూర్యతో కలిసి సినిమా చేయాల్సి వచ్చింది. అలా అప్పుడే మాత్రన్ సినిమా తెరకెక్కింది అంటూ ఉంటారు. 2014లో కూడా మహేష్ బాబుతో ఆయన సినిమా చేయాల్సి ఉంది. కానీ అప్పుడే మహేష్ బాబు ఆగడు లాంటి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సమయంలో రిస్క్ చేయడానికి ఆసక్తి చూపని మహేష్ బాబు ఆనంద్ కధ పూర్తిగా పక్కన పెట్టారు. అలా వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాకుండా పోయింది.


Click it and Unblock the Notifications











