HBD Mahesh babu: ఓకే ఫ్రేమ్ లో మహేష్ బాబు - రామ్ చరణ్.. భార్యలతో కలిసి స్పెషల్ స్టిల్!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే అగ్రహీరోలు స్నేహంగా ఉంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. వెండి తెరపై ఎంత స్టార్ హోదాతో కనిపించే ఆ స్టార్స్ ఒక్కసారి ఏకమై సినిమా చేయగలిగితే అభిమానుల కంటే ఎక్కువగా సంతోషించేవారు మరొకరు ఉండరు. అలాగే అభిమానుల మధ్య స్నేహ సంబంధాలు పెరగడానికి కూడా హీరోల ఫ్రెండ్ షిప్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది హీరోలు ఇతర హీరోలతో సమానంగా ఉండాలని అనుకుంటున్నారు.

ఏ మాత్రం స్టార్ హోదాని చూపించకుండా తోటి స్టార్స్ ను కూడా స్నేహితులుగా భావిస్తున్నారు. ఒక విధంగా ఆ ఫ్రెండ్ షిప్ మంచి వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా ఒకరిపై మరొకరు మరింత ప్రేమను పెంచుకుంటారు. బాక్సాఫీస్ రేంజ్ పెరగడానికి కూడా అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. రామ్ చరణ్ దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితోనూ ఫ్రీ గానే ఉండే ప్రయత్నం చేస్తాడు. ఇక మహేష్ బాబు కూడా అదే తరహాలో ఆలోచిస్తాడు. ఎవరి పుట్టిన రోజు వేడుక జరిగినా కూడా మొహమాటం లేకుండా విషెస్ ను అందించడం ఆయనకున్న మంచి అలవాటు. ఇక రామ్ చరణ్ మహేష్ బాబు కూడా మంచి స్నేహితులు అని అందరికీ తెలుసు.

Mahesh babu and ram charan family pic on supar star birthday special

అప్పట్లో వీరు రెగ్యులర్ గా కలుసుకుంటూ ప్రైవేట్ ఆ పార్టీలు కూడా చేసుకునేవారు. ప్రస్తుతం బిజీగా ఉండడం వలన కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఇక అప్పుడప్పుడు ఆ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనడం ఆ విధంగా ఈ ముగ్గురి మధ్య మంచి స్నేహం అయితే ఉంది. ఒక విధంగా మహేష్ బాబు అంటే రామ్ చరణ్ కు ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. అంతేకాకుండా ఫ్యామిలీ పరంగా కూడా వీరికి మంచి సాన్నిహిత్యం ఉంది ఉపాసన కొణిదెల నమ్రతా శిరోద్కర్ ఇద్దరు కూడా భర్త తరహాలోనే మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎలాంటి ఫెస్టివల్స్ జరిగిన కూడా ఇద్దరు ప్రత్యేకమైన బహుమతులను ఒకరికొకరు షేర్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక చాలా కాలం తర్వాత మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. వారితో పాటు వారి భార్యలు కూడా అందమైన చిరునవ్వులతో స్టిల్ ఇచ్చారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్ వారితో దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక నిమిషాల్లోనే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ RRR షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ మరొక హీరోగా నటిస్తున్న ఆ సినిమా అక్టోబర్ లో రావచ్చని డేట్ అయితే ప్రకటించారు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X