For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి తరువాత మహేష్ మరో పాన్ ఇండియా మూవీ.. పవర్ఫుల్ కాంబినేషన్!

  |

  టాలీవుడ్ నటుడు మహేష్ బాబు నుంచి తరువాత రాబోయే సినిమా సర్కారు వారి పాట షూటింగ్ ప్రస్తుతం గోవాలో మూడవ షెడ్యూల్ జరుపుకుంటోంది. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా విలన్ పాత్రలో సముద్రఖని కనిపించనున్నట్లు టాక్. అయితే దీని తరువాత త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు మహేష్.

  హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా దీనిని నవంబర్ లో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ మూవీ అనంతరం ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళితో శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న భారీ పాన్ ఇండియా ప్రాజక్ట్ చేయనున్నారు మహేష్. ఇప్పటికే ఆ మూవీ కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక పవర్ఫుల్ కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని 2025 లో విడుదల చేయనున్నారని అంటున్నారు.

  వరుసగా పాన్ ఇండియా సినిమాలు

  వరుసగా పాన్ ఇండియా సినిమాలు

  అయితే వీటి అనంతరం చేయబోయే నెక్స్ట్ మూవీ ని కూడా రెండు రోజుల క్రితం మహేష్ బాబు ఓకే చేశారని ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమాతో దర్శకుడి గా యావత్ భారత దేశ ఆడియన్స్ నుండి భారీ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల సీక్వెల్ గా తీసిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ షూట్ మొత్తం కంప్లీట్ చేసారు.

  యాష్, శ్రీనిధి శెట్టి నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరోవైవు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే మాస్, యాక్షన్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్, దీని తరువాత ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న భారీ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

  మాట ఇచ్చిన మహేష్ బాబు?

  మాట ఇచ్చిన మహేష్ బాబు?

  ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం గత కొంతకాలంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం మహేష్ ని ప్రత్యేకంగా గోవాలో కలిసి ఆ స్టోరీ ఆయనకి వినిపించారని, కాగా అది ఎంతో నచ్చిన మహేష్, త్వరలో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేయండి, నా ప్రస్తుత కమిట్మెంట్స్ అనంతరం మన సినిమానే పట్టాలెక్కిద్దాం అంటూ మాట కూడా ఇచ్చినట్లు సమాచారం.

  గతంలో మహేష్ తో భరత్ అనే నేను వంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రముఖ నిర్మాత దానయ్య ఈ మూవీని ఎంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించనున్నారని అంటున్నారు.

  మహేష్ ఇమేజ్ ని మరింతగా పెంచేలా

  మహేష్ ఇమేజ్ ని మరింతగా పెంచేలా

  మరోవైపు ఈ మూవీ కోసం మహేష్ బాబు బల్క్ గా డేట్స్ కూడా కేటాయించేలా ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సలార్ పూర్తి అయిన తరువాత దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ బయటకు రానుందని, సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ ని మరింతగా పెంచేలా ఈ మూవీ స్క్రిప్ట్ ని ఎంతో గ్రాండ్ గా సిద్ధం చేస్తున్నారట ప్రశాంత్ నీల్.

  అయితే ఈ న్యూస్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం మహేష్ తన నివాసంలో ప్రత్యేకంగా కలిసారు ప్రశాంత్ నీల్, కాగా ఆ సమయంలో వారిద్దరి సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.అయితే అది కేవలం సాధారణ మీటింగ్ మాత్రమే అంటూ మహేష్ అప్పట్లో మీడియాకి వివరించారు.

  Bazaar Rowdy Movie Heroine Maheshwari Exclusive Interview | Part 3
  మహేష్ కోసం మరికొందరు..

  మహేష్ కోసం మరికొందరు..

  మొత్తంగా ప్రస్తుత పరిస్థితిని బట్టి అటు ప్రభాస్ తో, ఇటు ఎన్టీఆర్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి టాలీవుడ్ హీరోతోనే వర్క్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇక మహేష్ బాబు కోసం మరికొందరు దర్శకులు కూడా కథలు సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు.

  ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈసారి అంతకుమించి అనేలా మరొక సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే పూరి జగన్నాథ్, సుకుమార్ వంటి సీనియర్ దర్శకులతో మరోసారి వర్క్ చేయాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

  English summary
  Mahesh babu another big budget pan india movie with pan india director
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X