మరో టాలెంటెడ్ హీరోను లైన్‌లో పెట్టిన మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 2020లో అత్యదిక ట్వీట్ చేయబడిన సౌత్ ఇండస్ట్రీ సెలబ్రెటీలలో మహేష్ అగ్ర స్థానంలో నిలవడం వైరల్ గా మారింధి. హీరోగానే కాకుండా మహేష్ నిర్మాతగా కూడా కొన్ని అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యువ టాలెంటెడ్ హీరోలతో సినిమాలను నిర్మించి G మహేష్ బాబు ప్రొడక్షన్ స్థాయిని పెంచాలని చూసుకుంటున్నారు.
ఇప్పటికే మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. అడివి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. అయితే నెక్స్ట్ మరో యువ హీరోతో కూడా సినిమా చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ యువ హీరో మరెవరో కాదు. నవీన్ పొలిశెట్టి. నవీన్ తో మహేష్ 1 నేనొక్కడినే సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవల నవీన్.. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఇండస్ట్రీలో ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇక ఆ సినిమాతోనే మహేష్ దృష్టిని ఆకర్షించిన నవీన్ త్వరలో మహేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించబోయే ఒక మినీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











