Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో స్టార్ దర్శకుడిని లైన్ లో పెట్టిన మహేష్ బాబు.. త్రివిక్రమ్, రాజమౌళి తరువాత అతనితోనే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో సర్కారు వారి పాట సినిమా కోసం చాలా సార్లు బ్రేక్ తీసుకోవాల్సి వస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడింది. అయితే ఆ సినిమా విడుదల కంటే ముందే మహేష్ బాబు మరో మూడు సినిమాల పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ రాజమౌళి కలయికలో సినిమాలు చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మహేష్ బాబు మరో దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మహేష్ పాన్ ఇండియా
టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కసారి పాన్ ఇండియా మార్కెట్ కు అలవాటు పడితే అదే తరహాలో కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నారు. మహేష్ బాబు కూడా త్వరలోనే ఆ దారిలో కొనసాగాల్సి ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా స్క్రిప్ట్ కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..
అయితే రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడు. అసలైతే ఈ ప్రాజెక్టు జనవరిలోనే లాంచ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వలన మహేష్ బాబు ఆ సినిమాను కూడా కాస్త వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే పూర్తి స్థాయిలో తన వైపు నుంచి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాడు. ఇక మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టు మొదలవుతుందని సమాచారం.

యాక్షన్ అడ్వెంచర్..
ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం మహేష్ బాబు పూర్తిస్థాయిలో లుక్ ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం త్రివిక్రమ్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి రాజమౌళి కోసం ఫిట్నెస్ లో కూడా మార్పులు తెచ్చే అవకాశం ఉందబి ఒక టామ్ అయితే వినిపిస్తుంది ఆ సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ గా వెండితెరపైకి రానున్నట్లు సమాచారం.

లైన్ లోకి కొరటాల శివ
అయితే ఇటీవల మహేష్ బాబు మరొక స్టార్ దర్శకుడిని కూడా లైన్లో పెడుతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు ఇదివరకే రెండు వరుస బాక్సాఫీస్ హిట్స్ అందించిన కొరటాల శివ అని తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమాతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్ బాబు అనంతరం ఆ దర్శకుడితో భరత్ అనే నేను సినిమా చేసి సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు.

మరో పాన్ ఇండియా..
ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమా తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అనంతరం అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన స్క్రిప్ట్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మహేష్ బాబు కోసం కూడా ఇటీవల కొరటాల శివ అద్భుతమైన కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అయితే రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మరో పాన్ ఇండియా మూవీగా వెండితెరపై వస్తుందట.