Don't Miss!
- Sports
Brett Lee Advice: కోహ్లీకి ఇంతకంటే మంచి టైం దొరకదు.. కచ్చితంగా ఈ టైం ఉపయోగించుకోవాలి
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దటీజ్ మహేష్ బాబు.. కరోనాతో ఉన్నా నెల రోజుల చిన్నారి ప్రాణానికి అండగా!
సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటూ అనేక మంది తల్లితండ్రుల ఆశీసులు అందుకుంటూ అన్ స్టాపబుల్ అంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన నెల రోజుల పసికందు ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే

మరో చిన్నారికి ప్రాణదానం
సూపర్
స్టార్
మహేష్
బాబు
పుణ్యమా
అని
అర్ధాంతరంగా
ఆగిపోవాల్సిన
ఎంతో
మంది
చిన్నారుల
ప్రాణాలు
నిలబడుతున్నాయి.
ఇప్పటికే
సుమారు
1050
మందికి
పైగా
పిల్లల
ప్రాణాలు
కాపాడాడు
మహేష్
బాబు.
తాజాగా
మరో
చిన్నారి
ప్రాణం
కూడా
నిలబెట్టాడు
సూపర్
స్టార్
మహేష్
బాబు.
అరుదైన
గుండె
జబ్బుతో
బాధ
పడుతున్న
మరో
చిన్నారి
ప్రాణం
కాపాడారు.
రీసెంట్గా
మహేష్
ద్వారా
మరో
చిన్నారికి
ప్రాణదానం
జరిగింది.
ఈ
విషయాన్ని
మహేష్
సతీమణి
నమ్రత
సోషల్
మీడియా
ద్వారా
షేర్
చేశారు.

త్వరగా కోలుకోవాలని
జాంబవంతుల శిరీష అనే మహిళకు జన్మించిన నెల వయసున్న చిన్నారికి ఆంధ్ర హాస్పిటల్ వారి సాయంతో సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ జరిపించి, పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి చేశామని నమ్రత వెల్లడించారు. ఈ క్రమంలో మహేష్ సర్జరీలు చేయించిన చిన్నారుల సంఖ్య 1057కు చేరింది. ఆ బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు నమ్రత శిరోద్కర్. ఈ ఆపరేషన్ చేసిన ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్ర హాస్పిటల్స్ సౌజన్యంతో అనేక ఆపరేషన్స్ చేయిస్తున్నారు మహేష్ బాబు.

చివరి చూపు కూడా చూసుకోలేక
నిజానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉండగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేక పోయారు మహేష్ బాబు. ఇక క్రేమహేష్ హీరోగా రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

వాయిదా పడే అవకాశాలు
కానీ, రాజమౌళి కోరిక మేరకు సినిమా వాయిదా వేసుకోవాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమాను 2022, ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ గత డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. కానీ, ఇంతలోనే మహేష్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అంతేకాదు, దాదాపు ఐదారు వారాల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. దీంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం మొదలైంది.

ప్లానింగ్ లో భాగంగా
మహేశ్ బాబు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా సినిమా షూటింగ్‌పై ఆ ప్రభావం పడకుండా సినిమా యూనిట్ ప్లాన్ చేసుకుందని అంటున్నారు. ఆ ప్లానింగ్ లో భాగంగా ఆయన లేని సన్నివేశాలు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్లోనే విశాఖపట్నంలో ఓ షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. ఇక ఇప్పట్లో ఆయన రారని క్లారిటీ రావడంతో ఆయన సన్నివేశాలను కూడా కొన్నింటిని డూప్ పెట్టి చేయించారని తెలుస్తోంది. కేవలం కొంత మేరకే మహేశ్ బాబుతో కూడిన సన్నివేశాలు షూట్ చేయాలని, ఆయన కోలుకున్నాక ఆ షూట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.