ఆ రూట్లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్న మహేష్ బాబు.. సౌత్ స్టార్స్ అందరూ ఆయన తరువాతే!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొన్ని రోజులుగా మహేష్ బాబు ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసిన పోస్టులు కొన్ని నిమిషాల్లోనే ట్రేండింగ్ లిస్టులో చేరుతున్నాయి. ట్విట్టర్ ప్రపంచంలో కూడా మహేష్ బాబు ఇటీవల ఒక సరికొత్త రికార్డును అందుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వారిలో మహేష్ బాబు మొదటి స్థానంలో నిలిచాడు.

చాలా పాజిటివ్ గా
మహేష్ బాబు సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటాడు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా ఎవరు కష్టపడి మంచి సినిమా చేసినా కూడా మహేష్ బాబు చాలా పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు. అంతే కాకుండా స్టార్ హీరోల పుట్టినరోజు కూడా ఎలాంటి భేదాన్ని చూపించకుండా విషెస్ కూడా అందిస్తారు.

వెయ్యి మందికి పైగా..
మహేష్ బాబు మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది చిన్నారులకు కూడా ఆయన అండగా నిలుస్తూ ఉంటూ హార్ట్ కు సంబంధించిన ఆపరేషన్స్ చేయిస్తున్నాడు. వెయ్యి మందికి పైగా చిన్నారులకు మహేష్ బాబు గుండె సంబంధిత ఆపరేషన్లను చేయించాడు. ఆ విషయం ద్వారా కూడా సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ అందుకున్నాడు అని చెప్పవచ్చు.

2010 నుంచి ట్విట్టర్ లో
ఇక మొత్తానికి మహేష్ బాబు ట్విట్టర్ ప్రపంచంలో ఒక సరికొత్త రికార్డును అందుకున్నాడు. 2010లో ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన మహేష్ బాబు వన్ మిలియన్ ఫాలోవర్స్ ను అందుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. 2016లో 2 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్న మహేష్ 2017 లో ఒక్కసారిగా 5 మిలియన్ ఫాలోవర్స్ మార్కును అందుకున్నాడు. ఇక 2020లోకి వచ్చేసరికి 11 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్నారు.

సౌత్ లో నెంబర్ వన్
ఇక 2021 మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ కు చేరుకుంది. ఈ నెంబర్ తో మహేష్ టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో అత్యదిక మంది ఫాలో అవుతున్న నెంబర్ వన్ హీరోగా రికార్డును అందుకున్నాడు. దీంతో మహేష్ బాబు పేరు సోషల్ మీడియా లో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇక సూపర్ స్టార్ అభిమానులు రికార్డుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలను క్రియేట్ చేసి అది కూడా ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

మహేష్ తరువాత..
ఇక మహేష్ బాబు తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 10.32 మిలియన్ ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మూడవ స్థానంలో సూర్య 7.34 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. అనంతరం కమల్ హాసన్ 7M , రజనీకాంత్ 6M ఫాలోవర్స్ తో తరువాత స్థానాల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా అగ్ర హీరోలు మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











