Mahesh Babu Birthday సూపర్‌స్టార్ సినిమాల ఫ్యాన్ షోలు.. రండి డ్యాన్సులతో హోరెత్తిద్దామంటూ ఎంఎస్ రాజు పిలుపు
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేను ఎన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్దమవుతున్నారు. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు తన 47వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పలు రకాల కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వరుస విజయాలతో ఉన్న తమ హీరోకు నభూతో నభవిష్యత్ అనే విధంగా ట్రెండింగ్‌కు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్ల మధ్య ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు చేసిన ట్వీట్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెంచింది. ఇంతకు మహేష్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఏమిటి? ఎంఎస్ రాజు చేసిన ట్వీట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబు 47వ పుట్టిన రోజు
మహేష్ బాబు 47వ బర్త్ డేను పురస్కరించుకొని అభిమానులు భారీ ట్రెండింగ్‌కు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో రికార్డు ట్రెండింగ్‌కు తెర లేపుతూ ఇప్పటికే ఫ్యాన్స్ రకరకాల ట్వీట్లతో విజృంభిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సినిమాలను ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు.

4k క్వాలిటీ ప్రింట్‌తో
మహేష్ బాబు పుట్టిన రోజ సందర్భంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి, ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రదేశాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలను 4k క్వాలిటీ ప్రింట్‌ను సిద్ధం చేస్తున్నారు.

ఎక్కడెక్కడ ఫ్యాన్స్ షోలు అంటే
ఓవర్సీస్‌లో పోకిరి, ఒక్కడు ఫ్యాన్స్ షోను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్, నైజాంలో శ్రీ వెంకటేశ్వర ఫిలింస్, వైజాగ్‌లో గాయత్రి దేవీ ఫిల్మ్స్, తూర్పు గోదావరి జిల్లాలో వింటేజ్ క్రియేషన్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదిత్య ఫిల్మ్స్, కృష్ణాలో హాస్య మూవీస్; గుంటూరులో పద్మాకర్ సినిమాస్, నెల్లూరులో ఎన్ సినిమాస్, సీడెడ్‌లో శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఎంఎస్ రాజు ట్వీట్‌తో హంగామా
మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామాను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు చేసిన ట్వీట్ కేక పుట్టించింది. ఆగస్టు 9వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాను థియేటర్‌లో చూడాలనుకొనే వారు నాకు కాల్ చేయండి. ఎవరైనా షో వేయాలనుకొంటే నన్ను సంప్రదిస్తే వారికి కావాల్సిన సహకారం అందిస్తాను. ఒక్కడు సినిమా చూస్తూ కేరింతలు కొడుతూ, డ్యాన్సులు చేస్తూ.. చప్పట్లతో థియేటర్‌ను దద్దరిల్లేలా చేస్తాం. మన హంగామాకు సంబంధించిన వీడియోను వైరల్ వీడియోగా మారుద్దాం అని ఎంఎస్ రాజు ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోకిరి, ఒక్కడు సినిమాల గురించి
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మాతగా భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్ నటించిన ఒక్కడు చిత్రం మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో పోకిరి రిలీజై బ్లాక్‌బస్టర్ రికార్డును అందుకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ రెండు సినిమాలకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేమంటే అతిశయోక్తి కాదేమో.


Click it and Unblock the Notifications











