మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. 'సర్కారు వారి పాట' మూడు సర్‌ప్రైజ్‌లు, డేట్ ఫిక్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఇటీవల మళ్ళీ సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. రాత్రి పగలు అని తేడా లేకుండా చిత్ర యూనిట్ సభ్యులు కష్టపడుతున్నారు. మహేష్ బాబు కూడా సమయాన్ని లెక్క చేయకుండా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. వరుసగా నాలుగు సర్‌ప్రైజ్‌లు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో రెండు ఒక డేట్ కు రిలీజ్ కనున్నాయని పక్కా సమాచారం అందుతోంది.

మరో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని

మరో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని

గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్ బాబు కరోనా లాక్ డౌన్ వలన చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ అయిన అనంతరం రెండుసార్లు బ్రేకులు పడ్డాయి. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాతో మరో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని రాత్రుళ్ళు కూడా కష్టపడుతున్నాడు.

సినిమాను త్వరగా ఫినిష్ చేయాలని

సినిమాను త్వరగా ఫినిష్ చేయాలని


మహేష్ బాబు చాలా వరకు రాత్రుళ్ళు షూటింగ్స్ పెట్టుకోడు. కానీ సినిమాను త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటే మాత్రం సమయాన్ని లెక్క చేయకుండా కష్టపడుతుంటాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకోవాలని అనుకుంటాడు. ఇక మొదటిసారి సర్కారు వారి పాట కోసం రాత్రుళ్ళు కాస్త ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.

Recommended Video

Mahesh Babu Pan India Line Up, బడా డైరెక్టర్స్ తో ప్లాన్ సిద్దం | Sarkaru Vaari Paata
సర్కారు వారి పాట అప్డేట్స్

సర్కారు వారి పాట అప్డేట్స్

అయితే సర్కారు వారి పాటకు సంబంధించిన సర్‌ప్రైజ్‌ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అప్పుడు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాటకు సంబంధించిన రెండు సర్‌ప్రైజ్‌లు వచ్చే అవకాశం ఉందట.

 వరుసగా మూడు సర్‌ప్రైజ్‌లు

వరుసగా మూడు సర్‌ప్రైజ్‌లు


ఇప్పటికే మేకింగ్ వీడియోతో పాటు , ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ లను సిద్ధం చేశారట. ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఒకరోజు ముందే మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి ఆ తరువాత పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే చిన్న బర్త్ డే టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X