ఆసక్తికరంగా మహేష్ బాబు ట్వీట్: సుక్కును విష్ చేస్తూ, నెక్ట్స్ మూవీ గురించి...
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ నేడు(జనవరి 11)న 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ స్టార్స్ సుకుమార్‌ను విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు. అయితే మహేష్ బాబు చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో గతంలో '1-నేనొక్కడినే' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో త్వరలో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని మహేష్ తన ట్వీట్లో ప్రస్తావించారు.

మోస్ట్ హంబుల్, టాలెంటెడ్ డైరెక్టర్
మోస్ట్ హంబుల్, టాలెంటెడ్ దర్శకుడైన సుకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన ఫేవరెట్ దర్శకుడిని మహేష్ బాబు విష్ చేశారు. ఈ సందర్భంగా తన తర్వాతి సినిమా విషయాన్ని ప్రస్తావించారు.
మన సినిమా కోసం ఎదురు చూస్తున్నానంటూ...
మన సినిమా ఎప్పుడు మొదలవుందా అని ఎదురుచూస్తున్నాను సర్.... అని మహేష్ బాబు తన ట్వీట్లో పేర్కొనడం ద్వారా తన నెక్ట్స్ ఫిల్మ్ సుకుమార్‌తోనే స్పష్టం చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వేసవిలో ప్రారంభం...
ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతోంది. ఇది రిలీజైన తర్వాత మహేష్-సుుమార్ కాంబినేషన్లో మూవీ మొదలు కానుంది.

సుకుమార్
15 ఏళ్ల క్రితం ‘ఆర్య' సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన సుకుమార్ 100%లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి భారీ విజయాలతో టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. ప్రస్తుతం సుకుమార్.. మహేష్ బాబుతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











