మహేష్ బాబుతో బాలీవుడ్ నిర్మాత చర్చలు.. మరో బిగ్ ప్లాన్?
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మహేష్ భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు. షూటింగ్ పనులైతే అక్టోబర్ లోగా పూర్తి చేయలని అనుకుంటున్నారట.
ఇక మరోవైపు మహేష్ ఇదే ఏడాది రాజమౌళి సినిమా కంటే ముందే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. రాజమౌళి RRR అనంతరం ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కొంత సమయాన్ని తీసుకోనున్న విషయం తెలిసిందే. ఇక ఆ గ్యాప్ లోనే మహేష్ అనిల్ రావిపూడితో కలిసి ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. అయితే మహేష్ తో ఒక బాలీవుడ్ నిర్మాత కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మహేష్ బాబుకు హిందీ నుంచి గతంలో ఆఫర్స్ చాలానే వచ్చాయి. కానీ నమ్మకమైన కథ వస్తే గాని వెళ్లకూడదని మహేష్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక బడా నిర్మాత కరణ్ జోహార్ అయితే మహేష్ కోసం ఒక రొమాంటిక్ యాక్షన్ కథను సెట్ చేసినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా మహేష్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇంకా సూపర్ స్టార్ ఆ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఒకే చేబితే రాజమౌళి సినిమా తరువాతే ఉండవచ్చని టాక్.


Click it and Unblock the Notifications











