అగ్ర హీరోల కంటే ప్రత్యేకంగా మహేశ్ బాబు కొత్త కారు.. ఏకైక వ్యక్తిగా సూపర్ స్టార్.. ధరెంతంటే?
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు.
ఇక టాలీవుడ్ మోస్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరైన మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం, SSMB29 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మహేశ్ బాబు గ్యారేజీలో అత్యంత ఖరీదైన కొత్త కారు చేరింది. దాని విలువ, ప్రత్యేకతలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

మరింత ఉత్సాహం: బాల నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సత్తా చాటిన మహేశ్ బాబు 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవా చాటాడు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

రెండు క్రేజీ సినిమాలు: ప్రస్తుతం మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

లగ్జరీ కారు: ఇదిలా ఉంటే ఇటీవల దుబాయ్ లో ఖరీదైన విల్లాను మహేశ్ బాబు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు మహేశ్ బాబు బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ ఎస్వీ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. లగ్జరీ కార్లను విక్రయించే ల్యాండ్ రోవర్ సంస్థ తమ రేంజ్ రోవర్ జాబితాలో తాజాగా తీసుకొచ్చిన మోడల్ SV. ఎలక్ట్రిక్, పెట్రోల్, డిజీల్ వేరియంట్లలో ఈ కారును సంస్థ విక్రయిస్తోంది.
సినిమా సెట్స్ లో: ఇక మహేశ్ బాబు కొనగోలు చేసిన బంగారు గోధుమ వర్ణంలోని అద్భుతమైన రేంజ్ రోవర్ ఎస్వీ కారు గరిష్ట ధర రూ. 5.4 కోట్లు. ఆయన హై ఎండ్ మోడల్ కొన్నట్లు సమాచారం. అత్యాధునిక ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్ తో రేంజ్ రోవర్ ఎస్వీ అదిరిపోయందట. హైదరాబాద్ శివారు మహేశ్వరంలో జరుగుతున్న గుంటూరు కారం షూటింగ్ లో భాగంగా సెట్స్ కు ఈ కారులో మహేశ్ వెళ్లినట్లు సమాచారం. అక్కడ పార్క్ చేసిన కారు ఫొటోలు వైరల్ గా మారాయి.

తొలి వ్యక్తిగా: అయితే చిరంజీవి, మోహన్ లాల్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఎంతోమంది దగ్గర ఖరీదైన రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. కానీ వాటన్నికంటే మహేశ్ బాబు కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఎస్వీ ప్రత్యేకమైనదట. బంగారు గోధుమ రంగులోని రేంజ్ రోవర్ ఎస్వీ కారు ఉన్న తొలి హైదరాబాద్ వ్యక్తి మహేశ్ బాబు అని అంటున్నారు. ఇక మహేశ్ దగ్గర ఇదివరకు రోల్స్ రాయిస్ ఘోస్ట్, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఏ7, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వంటి కార్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











