Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఖరీదైన కారవాన్ కొన్న మహేష్ బాబు.. రేటుతో పాటు ఫొటోలు కూడా షాక్ ఇస్తున్నాయి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత స్టార్ డమ్ ఉన్న హీరోల్లో ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న మహేష్ రేంజ్ కు తగ్గట్లుగానే సౌకర్యాలు ఉండేలా చూసుకుంటాడు. యాడ్స్ ద్వారానే ఎక్కువగా ఆదాయాన్ని పెంచుకునే మహేష్ ఇటీవల ఒక ఖరీదైన కారవాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దాని రేటుతో పాటు లీకైన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)
రిస్క్ లేకుండా
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా వంద కోట్ల బిజినెస్ చేయడం కామన్. శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ మార్కెట్ అమాంతంగా పెరుగుతూ వస్తోంది. రెమ్యునరేషన్ డోస్ కూడా గట్టిగానే పెరుగుతోంది. వీలైనంత వరకు రిస్క్ లేకుండా బాక్సాఫీస్ వద్ద క్లిక్కయ్యేలా ఉండే స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
బన్నీ వాహనం కంటే కూడా..
మహేష్ బాబుకు సంబంధించిన కరవాన్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కారవాన్ కు సంబంధించిన వార్తలు చాలా సార్లు వచ్చాయి. ఎంతో లగ్జరీగా ఉండే ఆ వాహనం చాలా ఫేమస్ అయ్యింది. దాదాపు ఏడు కోట్లతో దాన్ని నిర్మించారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు అంతకంటే ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేశాడు.
స్పెషల్ గా రెడీ చేయించుకున్న మహేష్
దేశంలో ఏ స్టార్ కు లేని కారావాన్ ను మహేష్ స్పెషల్ గా రెడీ చేయించుకున్నట్లు సమాచారం. సెక్యూరిటీ పరంగానే కాకుండా సౌకర్యాలతో కూడా ఒక మినీ మహల్ లా దర్శనమిస్తోంది. ఆ కారావాన్ లో ఒక మినీ కిచెన్ తో పాటు హాల్, బెడ్ రూమ్, బాత్రూమ్ కూడా ఉంది. ఆ కారవాన్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మిసియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.
దాని ధర ఎంతంటే..
ఇక అల్లు అర్జున్ కారావాన్ కోసం 7కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు మహేష్ బాబు అంతకంటే ఎక్కువగా ఖర్చ చేసి 8కోట్లతో రెడీ చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కారావాన్ పార్క్ చేయడం కోసం ఆ సినిమా షూటింగ్ సెట్స్ లలో స్పెషల్ గా ఒక తాత్కాలిక షెడ్డును కూడా నిర్మించారని సమాచారం.