twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rajamouli తో ఎలాంటి కాన్సెప్ట్ అంటే.. మొదటిసారి క్లారిటీ ఇచ్చిన మహేష్.. నా డ్రీమ్ అంటూ..

    |

    దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయాలని మహేష్ బాబు గత పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే రాజమౌళి మహేష్ సినిమా చేయడానికి సరైన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ కాంబినేషన్ అలా వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఈ ప్రాజెక్టుపై అఫీషియల్గా క్లారిటీ ఇచ్చి వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అయితే మహేష్ బాబు ఇంత వరకూ రాజమౌళితో సినిమా ఎలా ఉంటుంది అనే విషయం లో ఎప్పుడూ స్పందించలేదు. ఇక బయట వినిపిస్తున్న కథనాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ ఏ విధంగా చెప్పారు అనే వివరాల్లోకి వెళితే..

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కలయికలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేయాలని గత పదేళ్ల క్రితమే అనుకున్నాడు. కానీ ఇద్దరికీ సరైన టైం దొరకక పోవడంతో డేట్స్ కూడా అడ్జస్ట్ చేయలేకపోయారు. అలాగే మిగతా కమిట్మెంట్స్ కారణంగా కూడా ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.

    మహేష్ ప్లాన్

    మహేష్ ప్లాన్

    ఇక మొత్తానికి మహేష్ తదుపరి సినిమాను డైరెక్ట్ చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ అవగా ఆ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ను ఇదే నెలలో మొదలు పెట్టి ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ పనులను ఫినిష్ చేయనని మహేష్ డిసైడ్ అయ్యాడు. ఇక మళ్లీ రాజమౌళికి ఎలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు అని వచ్చే ఏడాది మొదట్లోనే ఆ ప్రాజెక్టులో ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నాడు.

     ప్రాజెక్టు డిస్టబ్ అవ్వకుండా..

    ప్రాజెక్టు డిస్టబ్ అవ్వకుండా..

    సాధారణంగా రాజమౌళి ఎవరైనా హీరోతో సినిమా చేయాలని అనుకుంటే ఆ హీరోకు మరొక సినిమా చేసే వీలు ఉండదు. ఎందుకంటే రాజమౌళి తన హీరోలు కొన్ని నెలలపాటు ఒకే తరహా లుక్స్ తో ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒక ప్రాజెక్టు కోసం మినిమం రెండేళ్ల వరకు సమయం కూడా తీసుకుంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. కాబట్టి ప్రాజెక్టు డిస్టబ్ అవ్వకుండా ఉండాలి అని ముందుగానే ఒప్పందం చేసుకుంటారు.

    కథ చర్చల్లో రాజమౌళి

    కథ చర్చల్లో రాజమౌళి

    ఇక మహేష్ బాబు కూడా రాజమౌళికి నచ్చినట్లు గానే ఆయనకు వీలైనంత ఎక్కువ సమయం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ముందుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టును ఫినిష్ చేసుకుని వచ్చే ఏడాది జనవరిలో సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథాచర్చలు బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

    స్పందించిన మహేష్

    స్పందించిన మహేష్

    అయితే ఇటీవల మేజర్ సినిమా ప్రమోషన్ లో మహేష్ బాబు మొదటి సారి రాజమౌళి తో చేయబోయే కాన్సెప్ట్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో విజయేంద్రప్రసాద్ అయితే మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్టు ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుంది అని ఆ ప్రాజెక్టు RRR కంటే హై రేంజ్ లోనే ఉంటుంది అని కూడా అన్నారు.

    నా డ్రీమ్ అంటూ..

    నా డ్రీమ్ అంటూ..

    ఇక రీసెంట్ గా మేజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు రాజమౌళి తో చేయబోయే ప్రాజెక్ట్ పై ఒక ప్రశ్న ఎదుర్కొన్నారు. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఉండబోతోంది అనేది నిజమేనా? అని అన్నప్పుడు కేవలం అది ఒక ఐడియా మాత్రమే అని ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయని అయితే ఆ ప్రాజెక్టు పై ఇప్పుడే మాట్లాడడం కూడా సరైన సమయం కాదని మహేష్ అన్నారు. అంతేకాకుండా రాజమౌళి తో వర్క్ చేయడం తన డ్రీమ్ అని తప్పకుండా ప్రాజెక్ట్ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించేందుకు సిద్ధమైనట్లుగా వివరణ ఇచ్చారు.

    English summary
    Mahesh babu clarification on ss rajamouli pan india project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X