For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తన ఆల్‌టైం ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పిన మహేశ్ బాబు: ‘సర్కారు వారి పాట’ గురించి షాకింగ్‌గా!

  |

  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు స్టార్లుగా వెలుగొందుతున్నారు. అందులో చాలా మంది తమ తమ ఫ్యాన్ బేస్‌ను మరింత ఎక్కువగా పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకటి. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఫలితంగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేశ్ ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఇందులో తన ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పేశాడు. అలాగే, 'సర్కారు వారి పాట'పై అంచనాలు పెంచేశాడు. ఆ వివరాలు మీకోసం!

   కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు

  కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు

  కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తీసిన ‘భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి', అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్‌ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు.

  Love Story Day 1 Collections: చరిత్ర సృష్టించిన నాగ చైతన్య.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డు

   సర్కారు వారి పాట పాడుతున్న మహేశ్

  సర్కారు వారి పాట పాడుతున్న మహేశ్

  సూపర్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది.

  మాటల మాంత్రికుడితో మరోసారి జోడీ

  మాటల మాంత్రికుడితో మరోసారి జోడీ

  హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ‘సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను ప్రకటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని నవంబర్ నుంచి ప్రారంభించబోతున్నారు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

  Bigg Boss: షొలో అర్ధరాత్రి వాళ్లిద్దరి రొమాన్స్.. పెదాలను తాకుతూ కొంటెగా.. అక్కడ కూడా కిస్ చేయమంటూ!

   యాడ్స్‌లోనూ దూసుకెళ్తోన్న స్టార్ హీరో

  యాడ్స్‌లోనూ దూసుకెళ్తోన్న స్టార్ హీరో

  ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న మహేశ్ బాబు కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో నిర్మాతగానూ ‘మేజర్' వంటి చిత్రాలను నిర్మిస్తున్నాడు. వీటితో పాటు చేతి నిండా యాడ్స్‌తో సత్తా చాటుతున్నాడు. మరే హీరోకూ సాధ్యం కాని విధంగా ఏక కాలంలో ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా చేస్తూ ఫుల్లుగా సంపాదిస్తున్నాడు.

   తనకు ఇష్టమైన సినిమా గురించి చెప్పి

  తనకు ఇష్టమైన సినిమా గురించి చెప్పి

  సూపర్ స్టార్ మహేశ్ బాబు సుదీర్ఘ కాలంలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రైవేటు ఈవెంట్‌లో పాల్గొన్న అతడు.. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఇందులో ఓ రిపోర్టర్ ‘మీరు నటించిన చిత్రాల్లో ఇష్టమైనది ఏది' అని ప్రశ్నించారు. దీనికి మహేశ్ బాబు ‘పోకిరి అంటే నాకు చాలా ఇష్టం. దాని వల్ల నాకు చాలా ప్లస్ అయింది' అని చెప్పుకొచ్చాడు.

  Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!

  Mahesh Babu Is The Brand Ambassador For Big C
  ‘సర్కారు వారి పాట' గురించి లీక్ చేసి

  ‘సర్కారు వారి పాట' గురించి లీక్ చేసి

  ఇదే ఈవెంట్‌లో మరో రిపోర్టర్ ‘పరశురాం.. పూరీ జగన్నాథ్ అసిస్టెంట్. ఈ సినిమా కూడా పోకిరి రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. దీనిపై మీరేమంటారు' అని ప్రశ్నించారు. దీనికి మహేశ్ బాబు ‘అవునండీ.. సర్కారు వారి పాట చాలా బాగా వస్తుంది. ఇది పోకిరిని మించేలా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు' అంటూ ఆ మూవీపై అంచనాలను బాగా పెంచేశాడు.

  షూటింగ్ అప్‌డేట్ కూడా ఇచ్చిన మహేశ్

  షూటింగ్ అప్‌డేట్ కూడా ఇచ్చిన మహేశ్

  ఇందులో మరో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘సర్కారు వారి పాట మూవీ వేగంగానే జరుగుతుంది. ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్ పూర్తైపోయింది. త్వరలోనే మిగిలిన దాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది పూర్తైన తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీ ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు. మహేశ్ ఇచ్చిన అప్‌డేట్లతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  English summary
  Tollywood Star Hero Mahesh Babu Recently Participated in Praivat Event. He Gave Clarity about his Favorite Movie In This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X