హాలీవుడ్ ప్రాజెక్ట్ మీద బాంబు పేల్చిన మహేష్ బాబు.. ముంబై రిపోర్టర్ నోరూ మూయించేశాడుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ పెరిగిపోయింది. ఇక ఆయన హాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల నుంచి ఫలానా హాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా ఓకే అయింది అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఆ ప్రచారానికి మహేష్ బాబు బ్రేకులు వేశాడు. తాజాగా ఒక యాప్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న మహేష్ బాబు ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలు

యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో

యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో క్విక్ ఆన్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటుడు మహేష్ బాబు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు.

చివరి షెడ్యూల్ షూటింగ్

చివరి షెడ్యూల్ షూటింగ్

ఇక ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తన సర్కారు వారి పాట చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుందని చెప్పిన మహేష్, ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని.. అది పాన్ ఇండియా మూవీగా రాబోతున్నట్లు మహేష్ చెప్పుకొచ్చాడు.

పిచ్చపిచ్చగా నచ్చుతున్నాయని

పిచ్చపిచ్చగా నచ్చుతున్నాయని

అంతేకాక మీరు స్ట్రెయిట్ హిందీ సినిమా ఎప్పుడు చేస్తారని ఒక బాలీవుడ్ రిపోర్టర్ అడిగినప్పుడు, మహేష్ "మీరు బొంబాయి నుంచి వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పాలనుకుంటున్నానని కౌంటర్ వేశారు. ఇక బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదని.. తెలుగులో తీసినా చాలని.. ఇప్పటికే ఇక్కడ తెరకెక్కించిన పలు సినిమాలు అక్కడి జనాలకు పిచ్చపిచ్చగా నచ్చుతున్నాయని మహేష్ అన్నారు.

 హాలీవుడ్ సినిమా చేయ‌డం లేద‌ని

హాలీవుడ్ సినిమా చేయ‌డం లేద‌ని

ఇక రాజమౌళి సినిమా గురించి మాట్లాడేందుకు మహేష్ ఇష్టపడలేదు. స‌మ‌యం, సంద‌ర్బాన్ని బట్టి సినిమా ఉంటుంద‌ని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అంతేకాదు కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా త‌న‌కు ఏ హాలీవుడ్ ప్రాజెక్టు గురించి తెలియ‌ద‌ని కామెంట్ చేసి ఎలాంటి హాలీవుడ్ సినిమా చేయ‌డం లేద‌ని ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు మ‌హేష్ బాబు.

ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో

ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో

నిజానికి మహేష్ బాబు ప్ర‌స్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో దర్శకుడు పరశురామ్ ఉన్నారు. ఇక ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Recommended Video

#HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu
 త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో

త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో

ఈ సినిమా విడుదల అయిన తర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో చేయబోతున్న‌సినిమాను మొదలుపెట్ట‌బోతున్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాక 2022 చివ‌ర‌లో కానీ, 2023లో కానీ రాజమౌళి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇక ఆ సినిమా ఎప్పటికి విడుదల అవుతుందనేది అది రిలీజ్ అయ్యే దాకా ఎవరికీ తెలియదు అనుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X