పొగిడాను కానీ.. నిందించలేదు.. నా తప్పే... సుకుమార్‌తో వివాదంపై మహేష్ క్లారిటీ!
భరత్ అనే నేను లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ నిర్మాణ సారథ్యంలో అత్యంత సాంకేతిక విలువలతో, మంచి సామాజిక సందేశంతో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్‌లో భాగంగా మహేష్ మాట్లాడుతూ.. సుకుమార్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

కొంత మంది డైరెక్టర్ల పేర్లను
ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో కొంతమంది డైరెక్టర్ల పేర్లు ప్రస్తావించకపోవడం గురించిన ప్రశ్నకు మహేష్ సమాధానమిస్తూ.. యూరప్ నుంచి ఫ్లయిట్‌లో 16 గంటలు ప్రయాణించి డైరెక్ట్‌గా వేదిక మీదకు వచ్చాం. స్టేజ్‌పైన మాట్లాడుతుంటే ఫ్యాన్స్ గందరగోళం సృష్టించారు. ఆ సందర్భంగా నేను దర్శకుల గురించి మాట్లాడుతున్నాను. ఫ్యాన్స్ గొడవ వల్ల నేను కొంత డిస్ట్రబ్ అయ్యాను అని మహేష్ చ చెప్పారు.

పూరీ జగన్నాథ్ పేరు చెప్పకపోవడం తప్పే
పోకిరి సినిమా అనేది నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. పూరి జగన్నాథ్ పేరు ప్రస్తావించకపోవడం తప్పే. పూరి జగన్నాథ్‌గారికి ధన్యవాదాలు. అలాగే సుకుమార్‌గారు '1' (నేనొక్కడినే) అనేది నా కెరీర్‌లో కల్ట్ ఫిల్మ్. అలాగే నా కుమారుడు గౌతమ్‌తో కలిసి నటించే అవకాశం కూడా లభించింది. సుకుమార్‌గారు నాకు ఇష్టమైన దర్శకుడు అని మహేష్ తెలిపారు.

వంశీ పైడిపల్లి రెండేళ్లు వెయిటింగ్
మహర్షి సినిమా గురించి మాట్లాడుతూ.. స్టేజిమీద వంశీ ఈ సినిమా కోసం రెండేళ్లు నిరీక్షించాడు. ఈ రోజుల్లో రెండు నెలలు ఆలస్యమైతే.. కథ పట్టుకొని డైరెక్టర్లు మరో హీరో వద్దకు వెళ్తున్నారు. అది నేను వంశీని పొగిడాను తప్ప సుకుమార్‌గారిని పాయింట్ అవుట్ చేసి అన్నది కాదు. కొంతమంది దాని గురించి నెగిటివ్‌గా న్యూస్‌లు కూడా రాశారు. సుకుమార్‌గారు నాకు వెరీ స్పెషల్ డైరెక్టర్‌తో పాటు మంచి ఫ్రెండ్ కూడా. ఫ్యూచర్‌లో మేమిద్దరం కలిసి వర్క్ చేస్తాం. ఆ విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ అవసరం లేదు.

అనిల్ రావిపూడితో సినిమా నా ఛాయిస్
అనిల్ రావిపూడితో సినిమా చేయడం మీ ఛాయిసా? లేక ఫ్యాన్స్‌దా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. అనిల్ రావిపూడితో సినిమా చేయాలన్నదీ కేవలం నా ఛాయిస్ మాత్రమే. చాలా కాలంగా వినోదాత్మక చిత్రం చేయలేకపోయాను. ఫ్రెష్‌గా ఏదో చెయ్యాలనిపిస్తున్నదునే ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను. బిగ్ ప్రాజెక్ట్. అలాంటి ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ రోల్ చేసి చాలా రోజులైంది. చాలా క్రూషియల్ సబ్జెక్ట్. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది. జూన్ ఎండ్ నుంచి సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అవుతుంది.


Click it and Unblock the Notifications











