ఎప్పుడూ అదే పనా.. బోర్ కొట్టదా.. అభిమానిపై మహేష్ బాబు ఫన్నీ కామెంట్స్
ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా జోష్‌లో ఫ్యామిలీతో విదేశీ టూర్ వేసిన ఆయన.. ఇటీవలే తిరిగి ఇండియా వచ్చారు. కాగా మహేష్ ఓ అభిమానిని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
''ఆపమ్మా ఆపు.. నీకు బోరు కొట్టట్లా.. ఎప్పుడూ ఇదే పనా..'' అని ఓ అభిమానితో అన్నాడు మహేష్ బాబు. విమానాశ్రయంలో తనను ఫొటో తీస్తున్న ఒక అభిమానినుద్దేశించి ఇలా అన్నాడు. మహేశ్ కారు దిగి నడిచి వస్తుండగా ఆ అభిమాని వరుసగా ఫొటోస్ తీస్తుండటం గమనించి సరదాగా ఇలా అన్నాడు మహేష్ బాబు. మహేష్ మాటలు విని అక్కడున్న వారంతా నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా తర్వాత తన తర్వాతి సినిమాను వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయబోతున్నాడు మహేష్ బాబు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











