Mahesh Babu: సెన్సేషనల్ రికార్డును అందుకున్న సూపర్ స్టార్.. ఇండియాలోనే మొట్టమొదటి హీరో మనోడే

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. చిన్న వయసులోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు మహేశ్ బాబు. హీరోగా మారిన తర్వాత ఎన్నో సక్సెస్‌లను సొంతం చేసుకున్నాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోగా ఎదిగిపోయాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ఈ హ్యాండ్సమ్ హీరో.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

అదే సమయంలో తన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు తాజాగా ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డును నమోదు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదున్న మహేశ్

హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదున్న మహేశ్

ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తీసిన 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'మహర్షి', అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్‌ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేసి మార్కెట్‌ను పెంచుకున్నాడు.

సర్కారు వారి పాట పాడుతోన్న మహేశ్

సర్కారు వారి పాట పాడుతోన్న మహేశ్

మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది.

త్రివిక్రమ్‌తో మూడో సినిమాకు సిద్ధంగా

త్రివిక్రమ్‌తో మూడో సినిమాకు సిద్ధంగా

'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ జరుగుతుండగానే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

మోకాలికి సర్జరీ.. రెస్ట్ మోడ్‌లో సందడి

మోకాలికి సర్జరీ.. రెస్ట్ మోడ్‌లో సందడి

వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న మహేశ్ బాబు.. కొంత కాలంగా మోకాలు సంబంధిత సమస్యతో బాధ పడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే దానికి సర్జరీ చేయించుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ అది పూర్తైన తర్వాత అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు.

సెన్సేషనల్ రికార్డు కొట్టేసిన స్టార్ హీరో

సెన్సేషనల్ రికార్డు కొట్టేసిన స్టార్ హీరో

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు బయట మాదిరిగానే సోషల్ మీడియాలో సైతం ఎంతో ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే అతడు చేసే పోస్టులకు భారీ స్థాయిలో స్పందన వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో మహేశ్ బాబుకు కాసింత ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో తాజాగా అతడు ఓ సెన్సేషనల్ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.

ఇండియాలోనే ఏకైక హీరోగా రేర్ రికార్డ్

ఇండియాలోనే ఏకైక హీరోగా రేర్ రికార్డ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు గత ఏడాది చాలా ట్వీట్లు చేశాడు. అందులో 30కి పైగా పోస్టులకు లక్ష అంతకంటే ఎక్కువ లైకులు వచ్చాయి. అలాగే, ఈ ఏడాది చేసిన ట్వీట్‌కు కూడా లక్షకు పైగా లైకులు దక్కాయి. ఇలా ఎక్కువ లక్ష లైకుల ట్వీట్లను అందుకున్న ఏకైక హీరోగా మహేశ్ బాబు రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియాలోనే ఏ హీరో కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయకపోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X