#MaMaMassCelebrations సర్కారు వారీ పాట మాస్ సెలబ్రేషన్స్.. స్టెప్పులతో ఇరుగదీసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రం నెగిటివ్ టాక్‌ను అధిగమించి భారీ లాభాలను సాధిస్తున్నది. ఈ సినిమాపై పాజిటివ్ టాక్‌ను పెంచేందుకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. మ మ మహేశా అంటూ కర్నూల్‌లో మాస్ సెలబ్రేషన్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో మహేష్ బాబు, ఎస్ఎస్ థమన్, పరుశురాం, నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్‌లో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ..

కోవిడ్ సమయంలో చాలా కష్టపడ్డాం

కోవిడ్ సమయంలో చాలా కష్టపడ్డాం

కోవిడ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా సర్కారు వారి పాట సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే సర్కారు వారీ పాట సినిమాకు వస్తున్న ఆదరణ చూసిన తర్వాత ఆ కష్టం అంతా మరిచిపోయాం. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నిషియన్స్, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు కీర్తి సురేష్, సముద్రఖని కొత్త అనుభూతిని పంచారు. తమన్ అందించిన పాటలు అద్బుతంగా ఉన్నాయి అని మహేష్ బాబు అన్నారు.

కర్నూల్‌కు రావడం హ్యాపీగా ఉంది

కర్నూల్‌కు రావడం హ్యాపీగా ఉంది

ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో కర్నూల్‌కు వచ్చాను. మళ్లీ సర్కారు వారీ పాట సినిమా కోసం ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మా నిర్మాతలు ఇక్కడ సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే ఇంత మంది వస్తారని ఊహించలేదు. మీరు మాపై చూపిస్తున్న ఆదరణకు రుణపడి ఉంటాను. ఇక ముందు ఏదైనా ఫంక్షన్ నిర్వహిస్తే రాయలసీమలో నిర్వహించాలనేంతగా జనం వచ్చారు అని మహేష్ బాబు అన్నారు.

గౌతమ్, సితారా రియాక్షన్ అదే..

గౌతమ్, సితారా రియాక్షన్ అదే..

మీ ఫ్యామిలీ సభ్యులతో సినిమా చూసిన తర్వాత వారి ఫీలింగ్ ఏమిటని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సినిమా చూడగానే నా కుమారుడు గౌతమ్ వచ్చి కౌగిలించుకొన్నాడు. నాన్న బాగా నటించావు అని సితారా కాంప్లిమెంట్ ఇచ్చింది. దాంతో నాకు చాలా చాలా సంతోషం వేసింది అని మహేష్ బాబు తెలిపారు.

మా నాన్న జడ్జిమెంట్ అదే..

మా నాన్న జడ్జిమెంట్ అదే..

ప్రతీ సినిమాను చూసినట్టే మా నాన్న కృష్ణ సర్కారు వారీ పాట చూశాడు. ఆయన జడ్జిమెంట్‌ పక్కాగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత పోకిరి, దూకుడు కంటే పెద్ద హిట్ అవుతుంది అని చెప్పాడు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి క్రెడిట్ అంతా పరుశురాందే అని మహేష్ బాబు అన్నారు.

 స్టేజీపై తమన్‌తో డ్యాన్స్

స్టేజీపై తమన్‌తో డ్యాన్స్

మ.. మ.. మాస్ సెలబ్రేషన్‌లో మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఎప్పుడూ ఆర్బాటానికి దూరంగా ఉండే మహేష్ బాబు.. స్టేజీ ఎక్కి డ్యాన్స్ చేశాడు. మ.. మ.. మహేశా పాటకు స్టెప్పులేశాడు. తమన్‌తో కలిసి మహేష్ వేసిన స్టెప్పులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ స్టెప్పులతో వేదిక వైబ్రెంట్‌గా మారింది.

జన సంద్రంగా కర్నూల్

జన సంద్రంగా కర్నూల్

సర్కారు వారి పాట సక్సెస్ సెలెబ్రేషన్స్‌ కోసం కర్నూలుకు భారీగా అభిమానులు, సినీ ప్రేక్షకులు తరలివచ్చారు. రెండు రోజుల వ్యవధిలోనే నిర్వాహకులు భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. మాస్ సెలబ్రేషన్స్‌కు వచ్చిన జనాన్ని చూసి మహేష్ బాబు థ్రిల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X