ప్రపంచ ధరిత్రీ దినోత్సవం.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
ప్రస్తుతం ప్రపంచం ఎలాంటి పరిస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇది కేవలం మానవాళికి మాత్రమే వచ్చిన ముప్పు. కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు గడగడవణికిపోతోన్నాయి. మనుషులంతా పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్ని అమలు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదు. అందరూ ఇంటి పట్టునే ఉండాలి.
ఇలా లాక్ డౌన్ విధించడంతో మనుషులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రకృతికి మాత్రం మేలే జరుగుతోంది. లాక్ డౌన్ వల్ల కాలుష్యం పూర్తిగా తగ్గింది. స్వచ్చమైన గాలి లభిస్తోంది. పశు పక్ష్యాదులు ఆనందంగా గడుపుతున్నాయి. రోడ్లన్నీ ఖాళీగా, నదులన్నీ స్వచ్చంగా మారాయి. ఎక్కడా కాలుష్యం అనేది కానరాకుండా పోయింది.

ఇదే విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గుర్తు చేస్తూ ధరిత్రీ దినోత్సవం గురించి వివరించసాగాడు. ఈ నీలి ఆకాశం, రోడ్లను చూస్తే కాలుష్యం అనేది లేదని తెలుస్తోంది. మనం ఇంట్లోనే ఉండటంతో ఈ ప్రకృతి రోజురోజుకూ కొత్తదనాన్ని పునరద్దరించుకుంటోంది.. కేవలం కరోనా లాంటి విపత్కర సమయంలోనే కాకుండా ఇది ఇలాగే కొనసాగడానికి మనకు చేతనైనా సాయాన్ని నిరంతరం చేద్దాం.. మన భూమి బాగుపడటానికి మనలో మనమే ఆలోచిద్దాం, రక్షిద్దాం, కాపాడుతాం, పునరుద్దరిద్దాం అంటూ ఓ సందేశాన్ని ఇచ్చాడు. కేవలం ఈ రోజు మాత్రమే కాదు ప్రతీ రోజూ ధరిత్రీ దినోత్సమే అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











