ఈ భూమ్మీద సూపర్ స్టార్ కు ఇష్టమైన ప్రదేశం అదే.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రపంచంలో ఏ చోటుకైనా వెళ్లగలడు. సినిమాల్లోనే శ్రీమంతుడు కాదు.. నిజ జీవితంలోనూ శ్రీమంతుడు. అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతు మహేష్ కు ఎవరూ సరిలేరనిపించుకుంటున్నాడు.

శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి వరుస హిట్లతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నాడు. సామాజిక సందేశాలతో కూడుకున్న చిత్రాలను నటిస్తూ... అభిమానులను చైతన్య పరుస్తున్నాడు. మహర్షి చిత్రంలో వీకెండ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకెళ్లేలా చేశాడు.

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ఎఫ్2 చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే లక్కీ చాన్స్ వచ్చింది. సరిలేరు నీకెవ్వరు అంటూ తెరకెక్కుతున్న ఈ మూవీలో మేజర్ పాత్రలో మహేష్ నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు మహేష్ విరామం తీసుకున్నాడు.

Mahesh Babu Enjoying Holidays In Swiss Alps With Family

దసరా సెలవుల్లో భాగంగా ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేశాడు. ఈ భూమ్మీదే తనకు ఇష్టమైన ప్రదేశం అని చెబుతూ.. ప్రస్తుతం అక్కడికే వెళ్లినట్లు అభిమానులకు అప్ డేట్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఈ భూమ్మీద నాకు ఇష్టమైన ప్రదేశం.. స్విస్ ఆల్ప్స్.. ఈ చిన్న బ్రేక్.. దసరా సెలవుల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా.. బ్యాటరీ ఫుల్ చేసుకుని తిరిగి వస్తా'నని అన్నారు.

మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుండగా.. బండ్ల గణేష్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీలో రష్మీకా మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X