Mahesh babu: సర్కారు వారి పాటతో మహేష్ న్యూ రికార్డ్.. 100 డేస్ తో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులు క్రియేట్ చేయడంలో ముందుంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఉహాలకందని రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మహేష్ బాబు పాత సినిమాల్లో కూడా ఇటీవల కాలంలో చాలా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. పుట్టినరోజు పోకిరి సినిమా రీ రిలీజ్ లో కూడా మంచి కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా అభిమానులు అయితే మహేష్ స్థాయిని పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక సర్కారు వారి పాట విడుదలైన వందరోజుల పూర్తి చేసుకుంది. ఫ్యాన్స్ కూడా 19వ తేదీన స్పెషల్ గా ఎంత హడావిడి సినిమాను చూడడం హాట్ టాపిక్ గా మారిపోయింది. వైజాగ్ లోని గోపాలపట్నం మౌర్య థియేటర్లో సర్కారు వారి పాట 100 డేస్ ఆడించడం మహేష్ బాబు కెరీర్ లోనే మరో బెస్ట్ రికార్డు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా సరే రెండు మూడు వారాలకు మించి ఎక్కువగా ధియేటర్లలో సందడి చేయడం లేదు. ఇక 50 రోజుల హడావిడి అనేది జనాలు ఎప్పుడో మర్చిపోయారు.

అలాంటిది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా 100వ రోజును కూడా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం ఈ రోజుల్లో కొత్త రికార్డు అని చెప్పవచ్చు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ సినిమా విడుదలైంది. అయినప్పటికీ ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లోకి వెళ్లి ఈ సినిమాను చూడడం గమనిస్తే వారి అభిమాన హీరోను ఏ స్థాయిలో ఇష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో ఏ హీరో సినిమా కూడా 50 రోజులకు మించి థియేటర్లలో ఉండటం లేదు. కానీ మహేష్ బాబు సినిమా మాత్రం ఎక్కడో ఒకచోట వంద రోజులలో పూర్తి చేసుకుంటూ ఉంటుంది. అప్పట్లో అయితే మహేష్ డిజాస్టర్ సినిమాలు కూడా థియేటర్లలో వంద రోజులు ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే రాజమౌళితో కూడా మొదటి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











