ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ అప్సెట్.. ఇక రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాల్లో మాత్రం ఆ రోత ఉండదు!

మహేష్ బాబు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హిట్స్ అయితే అందుకుంటున్నాడు. కానీ ఓ వర్గం ఆడియెన్స్ నుంచి ఒక విషయంలో తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ మహేష్ మాత్రం అదే తరహాలో వెళుతున్నాడు అనే టాక్ వస్తోంది. ఇక సర్కారు వారి పాట వరకు ఒకే తరహా కామెంట్స్ వచ్చాయి. అయితే రాబోయే రాజమౌళి త్రివిక్రమ్ సినిమాల్లో మాత్రం అలాంటి రొటీన్ రోత ఉండదని అర్ధమవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

స్టార్ ఇమేజ్ తోనే..

స్టార్ ఇమేజ్ తోనే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించే విధంగా స్టాండర్డ్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు స్టార్ ఇమేజ్ తోనే నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా కలెక్షన్స్ అయితే తగ్గడం లేదు.

ఫ్యాన్స్ అప్సెట్..

ఫ్యాన్స్ అప్సెట్..

అయితే సర్కారు వారి పాటకు సంబంధించిన ఒక విషయంలో ఫ్యాన్స్ మాత్రం బోరింగ్ గా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ గత కొంతకాలంగా ఒకే తరహా మెస్సేజ్ లు ఇవ్వడం ఓ వర్గం ఆడియెన్స్ కు అంతగా కనెక్ట్ అవ్వడం లేదు. ముఖ్యంగా శ్రీమంతుడు నుంచి ఈ తరహా మెస్సేజ్ లు ఎక్కువయ్యాయని అదే బోరింగ్ గా ఉందనే కామెంట్స్ కూడా వచ్చాయి.

తొందరగానే ముగింపు కార్డ్

తొందరగానే ముగింపు కార్డ్

సర్కారు వారి పాటలో అప్పులు లోన్లు మధ్యతరగతి ఫ్యామిలీ ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడం ఓ వర్గం ఆడియోన్స్ కు రొటీన్ రోతగానే అనిపించింది. ప్రతీ సారి మహేష్ నుంచి ఈ మెస్సేజ్ ల గోల ఏమిటి అనే వరకు వచ్చింది. మహేష్ కూడా ఈ కామెంట్స్ కు వీలైనంత తొందరగానే ముగింపు కార్డ్ వేయాలని అనుకుంటున్నాడు.

త్రివిక్రమ్ సినిమాలో..

త్రివిక్రమ్ సినిమాలో..

ఇక తదుపరి సినిమాను మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా త్రివిక్రమ్ డిఫరెంట్ పాయింట్ తోనే మంచి కథలను చెబుతూ ఉంటాడు. కానీ మెస్సేజ్ లు అయితే పెద్దగా ఇవ్వడు. వీలైనంత వరకు ప్రతీ ఒక్క క్యారెక్టర్ ను సినిమాలో అవసరమైనంత వరకు హైలెట్ చేస్తుంటాడు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా మెస్సేజ్ అయితే ఉండదట.

 రాజమౌళి ప్రాజెక్ట్..

రాజమౌళి ప్రాజెక్ట్..

ఇక రాజమౌళి సినిమాల్లో కూడా మెస్సేజ్ లు ఏ మాత్రం ఉండవు కానీ బాధ్యతాయుతంగా ఒక మంచి ఆలోచన కలిగే సినిమాలు చేస్తుంటారు. కథతో ఎమోషన్ ఉండేలా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ చేస్తారు. హీరోయిజం ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా విలన్ పాత్రలు కూడా పవర్ఫుల్ గా ఉంటాయి.

Recommended Video

Mahesh Babu ఆ డైరెక్టర్ మాటలు తెగ ఇబ్బంది పెట్టాయ్ | Sarkaru Vaari Paata | Filmibeat Telugu
అంతకుమించి అనేలా..

అంతకుమించి అనేలా..

త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు మహేష్ స్థాయిని మరింత పెంచుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా సినిమా అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇదివరకే కథ రచయిత విజేయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ సినిమాను జులైలో స్టార్ట్ చేయబోయే మహేష్ రాజమౌళి సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్ చేస్తాడని కూడా చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X