twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mahesh babu ఫ్యాన్స్ పోకిరి హంగామా.. బాక్సాఫీస్ కలెక్షన్స్ తో సేవా కార్యక్రమాలు

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా మంచి శ్రీమంతుడిలా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెండు గ్రామాలను దత్తత తీసుకోవడమే కాకుండా ఎంతోమంది చిన్నారులకు ప్రాణదాతగా నిలిచాడు. ఒక విధంగా సినిమాల కంటే కూడా తన మంచి పనులతోనే మహేష్ బాబు అభిమానులకు ఎంతో దగ్గరవుతున్నాడు. ఇక అదే బాటలో స్టార్ హీరో స్ఫూర్తితో అభిమానులు కూడా పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

    అయితే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఒక ప్రత్యేకమైన మంచి పనికి శ్రీకారం చుట్టారు ఏకంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో పేదలకు అండగా ఉండేందుకు ప్రణాళిక రచించడం ప్రశంసించదగిన విషయం. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొన్ని స్పెషల్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఇటీవల ఒక్కడు సినిమా స్పెషల్ షోలకు మంచి స్పందన లభించింది.

    Mahesh babu fans planing good work with pokiri re release collections

    మొదటి రోజు మొదటి షో విడుదలైన హంగామా ఎలా ఉంటుందో అదే తరహాలో మళ్లీ ఒక్కడు సినిమాకు భారీ స్థాయిలో స్పందన రావడం విశేషం. అయితే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను కూడా ప్రదర్శించబోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన పోకిరి సినిమా మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు చూసినా కూడా ఆ సినిమా బోర్ కొట్టదు. ఇక మరోసారి వెండితెరపై పోకిరి సినిమాను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా రెడీ అయ్యారు. అయితే పోకిరి సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కేవలం లాభం కోసం కాకుండా మంచి సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించాలి అని అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పేద పిల్లల చదువు కోసం అలాగే చిన్న పిల్లల వైద్య సహకారం కోసం ఉపయోగించనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

    English summary
    Mahesh babu fans planing good work with pokiri re release collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X