పవన్ కోసం మహేష్ అభిమానులు చేసిన పనికి అంతా షాక్.. మహేష్ మాటకు ఇంత రియాక్షనా?
అభిమనుల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇష్టమైన హీరో రియాక్షన్ ను బట్టి ఎలాగైనా మారుతుంటారు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఇంకా మార్పు రాలేదు. అదే ఫ్యాన్స్ వార్. సోషల్ మీడియా వచ్చిన తరువాత అభిమానుల మధ్య మాటల యుద్ధాలు ఊహించని రేంజ్ లోకి వెళుతున్నాయి. ఇక ఇటీవల మహేష్ చెప్పిన ఒక మాటకు పవన్ కోసం ఆయన అభిమానులు చేస్తున్న పనికి అందరూ షాక్ అవుతున్నారు.

ఫ్యాన్స్ వార్ ఈనాటిది కాదు
ఫ్యాన్స్ వార్ అనేది ఈ రోజుల్లో పుట్టింది కాదు. సీనియర్ హీరోల కాలం నుంచి వస్తున్నదే. ఒకప్పుడు ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే.. వేరే హీరో పాట వచ్చినప్పుడు మరొక హీరో అభిమానులు బయటకు వెళ్లిపోయేవారు. ఆ రేంజ్ లో వాతావరణం ఉండేది. ఇక వెంకటేష్ లాంటి హీరో ప్రస్తుత జనరేషన్ కు మల్టీస్టారర్ కథలతో ఒక మంచి బాట వేశాడు.

అభిమానుల ఆలోచనలను మార్చాలని..
ఇక మిగతా హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహేష్ బాబు కూడా అభిమానుల ఆలోచనలను మార్చాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఎన్టీఆర్ ను భరత్ అనే నేను ఈవెంట్ కు పిలిచి నందమూరి అభిమానులను ఎట్రాక్ట్ చేశాడు.

మెగా ఫ్యాన్స్ కూడా
ఇక అక్కినేని వారితో కూడా క్లోజ్ గా ఉంటున్న మహేష్ అఖిల్ సినిమా కోసం అప్పట్లో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఆ విధంగా అన్ని రకాల అభిమానులతో ఉంటున్న మహేష్ మెగా ఫ్యాన్స్ ను కూడా ఎప్పుడో ఎట్రాక్ట్ చేశాడు. మెగాస్టార్ ను సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కు స్పెషల్ గెస్టుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

పవన్ పై మహేష్ ట్వీట్స్..
ఇక ఇప్పుడు అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వరుసగా ట్వీట్ చేయడం ఆయన అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. పుట్టినరోజు విషెస్ తో పాటు, ఇటీవల వకీల్ సాబ్ పై పాజిటివ్ రివ్యూ ఇవ్వడం అలాగే ఆయన కారోనా భారిన పడితే కోలుకోవాలని చెప్పడం అందరిని ఎట్రాక్ట్ చేసింది.
Recommended Video

పవన్ కోసం.. మహేష్ ఫ్యాన్స్..
మహేష్ చేసిన ట్వీట్స్ కు అతని అభిమానులు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఏకంగా దేవాలయాలకు వెళ్లి పవన్ పేరు మీద పూజలు చేయిస్తున్నారు. రీసెంట్ గా పుట్టపర్తి మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ హనుమాన్ టెంపుల్ లో పవన్ కోలుకోవాలని పూజ చేయడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిజంగా అందరి హీరోలు మహేష్ బాబులా స్పందించగలిగితే అభిమానుల మధ్య ఒక మంచి వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











