For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ బాబు 45 రోజుల టార్గెట్: కొత్త ప్రాజెక్టు కోసం సూపర్ స్టార్ ప్లాన్ అదుర్స్

  |

  కొంత కాలంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతున్నాడు. ఈ జోష్‌లోనే మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమాకు కమిట్ అయ్యాడు. దీని కథ, ఇందులో హీరో పాత్ర గురించి ఎన్నో రకాల గాసిప్‌లు కూడా వినిపించాయి. అయితే, ఇది కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయింది. ఆ వెంటనే ఊహించని విధంగా పరశురాంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

  Paagal Movie Twitter Review: పాగల్‌కు ఊహించని టాక్.. ప్లస్‌లు మైనస్‌లు ఇవే.. మొత్తంగా ఎలా ఉందంటే!

  కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పరశురాం డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'సర్కారు వారి పాట'. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను సందేశాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినా.. షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌ను దుబాయ్‌లో విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  Mahesh Babu Fix 45 Days Target to Parasuram for Sarkaru Vaari Paata

  'సర్కారు వారి పాట' మూడో షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేశారు. దీని కోసం చిత్ర యూనిట్ కొద్ది రోజుల్లోనే అక్కడకు వెళ్లబోతుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు పాటను కూడా షూట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ గురించి అందుతోన్న సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' విషయంలో దర్శకుడు పరశురాంకు హీరో మహేశ్ బాబు 45 రోజుల టార్గెట్ ఫిక్స్ చేశాడట. ఈ సమయంలోనే తన సీన్లను పూర్తి చేయాలని తేల్చి చెప్పేశాడట. దీంతో అందుకు అనుగుణంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ మొత్తం చూపించిన తెలుగు పిల్ల

  'సర్కారు వారి పాట' తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బడా డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను చేయనున్నాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు ఉంటుంది. ఇవన్నీ అనుకున్న సమయానికి మొదలు పెట్టాలన్న లక్ష్యంతోనే ఇప్పుడు పరశురాంకు టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని ఎలాగైనా సెప్టెంబర్ చివరి నాటికి కంప్లీట్ చేసి.. ఆ వెంటనే గురూజీతో సినిమాను ప్రారంభించేందుకు మహేశ్ బాబు ప్లాన్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు క్లాస్, మాస్ లుక్స్‌లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో మహానటి కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించబోతుంది. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలై టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Now Super Star Fix 45 Days Target to Parasuram for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X