మహేశ్ బాబు డేరింగ్ డెసీషన్: కెరీర్‌‌లో తొలిసారి అలా.. వర్కౌట్ అవుతుందా.?

By Manoj

హ్యాండ్సమ్‌ లుక్‌తో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న అతడు.. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాడు. ఫలితంగా కొన్ని హిట్లను అందుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు తన లుక్ విషయంలో కెరీర్‌లోనే తొలిసారి ఓ ప్రయోగం చేయబోతున్నాడట. వివరాల్లోకి వెళ్తే..

వరుసగా మూడు.. రికార్డులు బద్దలు కొట్టాడు

వరుసగా మూడు.. రికార్డులు బద్దలు కొట్టాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గతంలో ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి సూపర్ హిట్లను అందుకున్న అతడు.. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు ఖాతాలో పలు రికార్డులు కూడా వచ్చి చేరాయి.

రెండో అవకాశం ఇచ్చాడు.. పక్కన పెట్టేశాడు

రెండో అవకాశం ఇచ్చాడు.. పక్కన పెట్టేశాడు

‘సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు.. ‘మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అంతేకాదు, ఈ సినిమా మాఫియా నేపథ్యంతో తెరకెక్కుతోందని, ఇందులో మహేశ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. కొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటున్న సమయంలో.. దీన్ని పక్కన పెట్టేశాడు సూపర్ స్టార్.

చిన్న డైరెక్టర్.. పెద్ద హిట్.. మహేశ్‌తో ఛాన్స్

చిన్న డైరెక్టర్.. పెద్ద హిట్.. మహేశ్‌తో ఛాన్స్

వంశీ పైడిపల్లితో సినిమా ఆగిపోవడంతో మహేశ్ బాబు ఏ డైరెక్టర్‌తో జట్టు కట్టబోతున్నాడన్న దానిపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వాటన్నింటినీ తల్లకిందులు చేస్తూ అతడు.. ‘గీత గోవిందం' ఫేం పరశురాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రియేటర్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

ముహూర్తం ఫిక్స్ చేశారు.. టైటిల్ రివీల్

ముహూర్తం ఫిక్స్ చేశారు.. టైటిల్ రివీల్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను ఉగాదికి ప్రారంభించాలని భావించారు. కానీ, కరోనా ప్రభావంతో వాయిదా పడింది. ఈ సినిమా ప్రారంభోత్సవ తేదీని మే 31కి ఫిక్స్ చేశారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. అదే రోజున సినిమా టైటిల్ రివీల్ చేస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది.

మహేశ్ డేరింగ్ డెసీషన్: కెరీర్‌‌లో తొలిసారి..

మహేశ్ డేరింగ్ డెసీషన్: కెరీర్‌‌లో తొలిసారి..


ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఇందులో అతడు గుబురు గెడ్డంతో దర్శనమివ్వబోతున్నాడట. అతడి కెరీర్‌లో ఇలాంటి లుక్ ఇంత వరకు చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. అలాగే, ఒత్తైన జుట్టు కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రాజమౌళితో మహేశ్ బాబు కాంబో ఫిక్స్

రాజమౌళితో మహేశ్ బాబు కాంబో ఫిక్స్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జక్కన్న మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరశురాంతో సినిమా అయిపోయిన తర్వాత మరో దర్శకుడితో మహేశ్ బాబు జత కట్టబోతున్నాడట. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో అతడి సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X