twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు వాటా రూ. 50 కోట్లు? సరికొత్త రికార్డ్ కాబోతోందా?

    |

    Recommended Video

    Mahesh Babu Sets A New Record | Filmibeat Telugu

    సుకుమార్‌తో చేయాలనుకున్న ప్రాజెక్టు రద్దయినట్లు మహేష్ బాబు స్వయంగా ప్రకటించడంతో ఆయన తన తర్వాతి చిత్రాన్ని 'ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడితో చేయబోతున్నారనే విషయం దాదాపు ఖరారు చేసినట్లయింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతోంది.

    అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడం, దానికి తోడు అతడి ఖాతాలో వరుస విజయాలు ఉండటం, 'ఎఫ్ 2'తో మరోసారి తన సత్తా నిరూపించడంతో మహేష్ బాబు ఈ యంగ్ డైరెక్టర్ మీద పూర్తి నమ్మకం పెట్టారట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారు. దిల్ రాజు కూడా నిర్మాణంలో భాగం అయ్యే అవకాశం ఉంది.

    రూ. 50 కోట్ల బడ్జెట్?

    రూ. 50 కోట్ల బడ్జెట్?

    మహేష్ బాబు సినిమా అంటే బడ్జెట్ రేంజి కూడా అదే స్థాయిలో ఉంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే బడ్జెట్ అంచనాలు వేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండానే రూ. 50 కోట్ల ఖర్చులో సినిమా తీసేలా ప్రణాళికలు సిద్ధం చేశారట.

    డిజిటల్, శాటిలైట్, హిందీ రైట్స్ ద్వారా పెట్టుబడి రికవరీ

    డిజిటల్, శాటిలైట్, హిందీ రైట్స్ ద్వారా పెట్టుబడి రికవరీ


    ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టిస్తున్న అనిల్ రావిపూడి పక్కా ప్లానింగుతో బడ్జెట్ అంచనాలు, ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టే ప్రణాళికలు సిద్ధం చేశాడట. కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో అదనపు ఆధాయం వస్తుండటంతో నిర్మాతలు పెట్టే రూ. 50 కోట్లు బడ్జెట్ రికవరీ అయ్యేలా లెక్కలు వేస్తున్నాడట.

    రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

    రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇక మహేష్ బాబు సినిమా అంటే థియేట్రికల్ రైట్స్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు గత చిత్రం భరత్ అనే నేను రూ. 90 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 220 కోట్లకుపైగా గ్రాస్, రూ. 105 కోట్లకుపైగా షేర్ రాబట్టింది ఈ నేపథ్యంలో మహేష్-అనిల్ రావిపూడి సినిమాకు. రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా.

    మహేష్ బాబుకు రూ. 50 కోట్లు?

    మహేష్ బాబుకు రూ. 50 కోట్లు?

    డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా వచ్చే రూ. 50 కోట్లతో సినిమా పెట్టుబడి నిర్మాతలకు తిరిగి వస్తుంది. థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే రూ. 100 కోట్లో నిర్మాతలకు రూ. 50 కోట్లు, మహేష్ బాబుకు రెమ్యూనరేషన్(షేర్) రూపంలో 50 కోట్లు దక్కేలా ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.

    సరికొత్త రికార్డ్ ఖాయమా?

    సరికొత్త రికార్డ్ ఖాయమా?

    మహేష్ బాబు రూ. 50 కోట్ల షేర్ అందుకోబోతున్నారనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరో కూడా ఒక సినిమా ద్వారా ఇంత భారీ మొత్తం అందుకోలేదు. అదే నిజమైతే టాలీవుడ్లో ఇది సరికొత్త రికార్డ్‌గా నిలవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    English summary
    Mahesh Babu's next will be directed by Anil Ravipudi, produced by Anil Sunkara and Dil Raju. Mahesh will get fifty percent of the theatrical business as his remuneration and the rest will be shared between the producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X