క్వారంటైన్‌లో మహేష్‌బాబు.. సర్కారు వారీ పాట యూనిట్‌లో కరోనా కలకలం
టాలీవుడ్‌లోని పలు సినిమాలకు సంబంధించిన యూనిట్ సభ్యులను కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. పలు యూనిట్లలో కరోనా కలకలం రేపడంతో షూటింగులు వాయిదా పడుతున్నాయి. తెలంగాణ, ఏపీలో విపరీతంగా కరోనా కేసులు నమోదు అవుతుండం తెలుగు సినిమా పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను కూడా కరోనావైరస్ వెంటాడింది. ఆ వివరాల్లోకి వెళితే..

దుబాయ్ తదితర ప్రాంతాల్లో
లాక్‌డౌన్ కారణంగా సర్కారు వారీ పాట మూవీ షూటింగు కావడం తెలిసిందే. లాక్‌డౌన్ ఎత్తి వేసిన తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ను యుద్ధ ప్రతిపాదికన మొదలుపెట్టారు. దుబాయ్ తదితర ప్రాంతాల్లో నిర్విరామంగా షూటింగు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో మహేష్ బాబు, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కోవిడ్19 ప్రమాణాలను పాటిస్తూ
అయితే హైదరాబాద్ పరిధిలో కరోనావైరస్ విజృంభించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగు చేశారు. అయితే మాస్కులు, శానిటైజర్లు, ఇతర ప్రమాణాలను పాటించినా మహేష్ బాబు పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని తెలిసింది. దాంతో మహేష్‌తో అతి సన్నిహితంగా వ్యవహరించే వ్యక్తి కావడం, సెట్లో కీలకంగా వ్యవహరించడంతో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగును వాయిదా వేసినట్టు తెలిసింది.

యూనిట్‌లో కొందరికి అస్వస్థత
కరోనావైరస్ బారిన పడిన మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సినిమా నిర్వాహకులు అతడికి అండగా నిలిచారు అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సర్కారు వారి పాట సినిమా యూనిట్‌లో మరికొందరికి కూడా కరోనా పాజిటివ్ అనే విషయం బయటకు వచ్చింది. అయితే అధికారికంగా ఎవరూ ధృవీకరించడకపోవడంతో ఈ వ్యవహారంపై సందిగ్థత నెలకొన్నది.

ఐసోలేషన్‌లో సూపర్ స్టార్
కరోనా ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో షూటింగు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాన్ని మహేష్ బాబు వ్యక్తం చేశారు. తన పర్సనల్ స్టైలిస్ట్ కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే సామాజిక బాధ్యతను పాటిస్తూ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఇంటిలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. యూనిట్ సభ్యులు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు అని సినీ వర్గాలు తెలిపాయి.
Recommended Video

దుబాయ్‌కి వెళ్లే ఆలోచనలో
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా విషయానికి వస్తే.. దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొచ్చింది. అయితే హైదరాబాద్‌లో పరిస్థితులు బాగా లేని కారణంగా షూటింగ్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ దుబాయ్‌లో షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం అంటూ యూనిట్ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











