12 Years Of Khaleja: అప్పట్లో ఫ్యాన్స్ ను ఊరించిన బిగ్ మూవీ.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మొదటి సినిమా అతడు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. ఇక మొత్తానికి 2010లో వీరి కలయికలో వచ్చిన ఖలేజా సినిమా విడుదలకు ముందు అయితే భారీ స్థాయిలో హైప్ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరిపోతా రికార్డులు క్రియేట్ చేస్తుంది అని కూడా అందరూ అనుకున్నారు.
ఎందుకంటే ఆ సినిమా సాంగ్స్ కూడా ముందుగానే ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయిని పెంచాయి. అంతేకాకుండా స్పెషల్ పోస్టర్స్ కూడా ఎంతగానో ఊరించాయి. అయితే విడుదల తర్వాత మాత్రం వెండితెరపై త్రివిక్రమ్ మ్యాజిక్ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా పెద్దగా లాభాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమాను 2009 లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన ప్రొడక్షన్ లో ఇబ్బందులు రావడం వలన సినిమా ఏడాది వరకు వాయిదా పడుకుంటూ వచ్చింది.

ఇక మొత్తానికి 2010 అక్టోబర్ 7 సినిమా విడుదల అయింది ఇక నేటికీ ఆ సినిమా వచ్చి 12 సంవత్సరాలు అవుతోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రాఫిట్స్ అందుకోకపోయినప్పటికీ కూడా మహేష్ బాబును మాత్రం త్రివిక్రమ్ చాలా కొత్తగా చూపించాడు. అందులో మహేష్ కామెడీ టైమింగ్ కూడా అప్పటివరకు ఏ సినిమాలో చూడలేదు.
మహేష్ బాబు అనుష్క శెట్టి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలా వరకు కామెడీ సన్నివేశాలకు అలాగే యాక్షన్స్ సీన్స్ కు డైలాగ్స్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా అప్పట్లో 30 కోట్ల బడ్జెట్ తో తెరపైకి తీసుకువచ్చారు. అప్పటివరకు కూడా అదే అత్యధిక బడ్జెట్ కావడం విశేషం. ఇక బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా 25 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అని సమాచారం. ఏదేమైనా కూడా ఖలేజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక వీరి కలయికలో మళ్ళీ ఇన్నాళ్లకు మరో సినిమా రెడీ అవుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











