Mahesh Babu: అల్ట్రా స్టైలిష్ లుక్ లో మహేశ్ బాబు.. లీక్ చేసిన హెయిల్ స్టైలిష్ట్
సుమారు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ.. హవాను చాటుతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా మహేశ్ బాబు కెరీర్ స్టార్టింగ్ లోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక మహేశ్ బాబు అందానికి అమ్మాయిలు అందరూ ఫిదా అయ్యారు. ఆయనకు హార్డ్ కోర్ అభిమానులుగా మారిపోయారు. ఈ టాలీవుడ్ అందగాడు ప్రస్తుతం రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి మరణం తర్వాత మళ్లీ షూటింగ్ ల్లో పాల్గొంటున్నాడు మహేశ్ బాబు. ఈ క్రమంలోనే తాజాగా SSMB28 సినిమాలోని మహేశ్ లేటేస్ట్ లుక్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మూడో సినిమా కావడంతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేష్ బాబు SSMB 28 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అయితే మార్కెట్లో కూడా ఈ సినిమాకు రోజురోజుకు డిమాండ్ గట్టిగానే పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ కు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కు సిద్ధమవుతోంది.
ఎన్నడు చేయని మాస్ పాత్ర..
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్నడు చేయని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్ లో మహేశ్ బాబు కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో మహేశ్ బాబు వైట్ షర్ట్ వేసుకుని అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ప్రముఖ హెయిల్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీంతో క్షణాల్లో ఈ పిక్ వైరల్ గా మారింది.
మహేశ్ కోసం రెండేళ్లుగా..
దీంతో మహేశ్ బాబు అభిమానులు, నెటిజన్లు వయసు పెరుగుతున్న అంతకుమించి అందం పెరుగుతూ యంగ్ లుక లో అదరగొడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకుముందు అల్లు అర్జున్ తో చేసిన అల.. వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా సక్సెస్ అనంతరం మహేష్ బాబుతో సినిమా చేయాలి అని త్రివిక్రమ్ గత రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు. ఇక మొత్తానికి ఈ కాంబినేషన్ ఇటీవల పట్టాలు ఎక్కేసింది. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీక్ చేయాలని టార్గెట్ అయితే సెట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











