Mahesh Babu: కొత్త ఫోన్ లో డిఫరెంట్ గా మహేశ్ బాబు సెల్ఫీ.. ఫొటో వైరల్.. మొబైల్ ధర ఎంతంటే?
సుమారు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ.. హవాను చాటుతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా మహేశ్ బాబు కెరీర్ స్టార్టింగ్ లోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక మహేశ్ బాబు అందానికి అమ్మాయిలు అందరూ ఫిదా అయ్యారు.
ఆయనకు హార్డ్ కోర్ అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతంత సినిమాలతో బిజీగా ఉన్న మహేశ్ బాబు లేటెస్ట్ గా సెల్ఫీ తీసుకున్నాడు. అది కొత్త ఫోన్ నుంచి తీసుకున్న సెల్ఫీ. దీంతో ఈ ఫొటో వైరల్ కావడంతోపాటు ఆ ఫోన్ ఏంటీ? దాని ధరెంత? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఏ టూర్ కు వెళ్లినా..
మహేశ్ బాబు సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా సమయం వెచ్చిస్తాడు. ఇటు ఫ్యామిలీ, అటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఏ టూర్ కు వెళ్లిన, సినిమా సెట్ లో అయిన మహేశ్ బాబును ఫొటోలు తీశారు కానీ, ఆయనే స్వయంగా సెల్ఫీ తీసిన సందర్భాలు లేవు.

ఫ్యామిలీ వెకేషన్స్ లోనూ..
ఫ్యామీలీ వెకేషన్స్ లో సైతం ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే సెల్ఫీలు తీసేవారు కానీ ఆయన చేతులతో సెల్ఫీ క్లిక్ మనిపించిన దాఖలాలు కనపడవు. అలాంటిది ఆయన సెల్ఫీ తీశారంటే కాస్త కొత్తగానే అనిపిస్తుంది. బట్ ఫర్ ఏ చేంజ్ అంటూ మహేశ్ బాబు తీసిని సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఫోన్ పై నెటిజన్ల దృష్టి..
ఈ పిక్ లో ఆయన చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సెల్ఫీతోపాటు మహేశ్ బాబును క్లిక్ మనిపించిన ఆ ఫోన్ పై కూడా నెటిజన్ల దృష్టి పడింది. దీంతో ఆయన కొత్త ఫోన్ కొన్నారు కాబట్టే కాస్తా కొత్తగా సెల్ఫీ తీసుకున్నాడని చర్చించుకుంటున్నారు.

రెస్ట్ అండ్ రీఛార్జ్ అంటూ..
అయితే మహేశ్ బాబు తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేశ్ బాబు.. ఆ పిక్ కు 'రెస్ట్ అండ్ రీఛార్జ్. చిల్ నూన్స్. ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట వైరల్ కాగా మహేశ్ బాబు కొత్త ఫోన్ తీసుకున్నాడని అర్థమైపోతుంది. దీంతో మహేశ్ బాబు తీసుకున్న కొత్త ఫోన్ ధరపై నెటిజన్లు దృష్టి సారించారు.

ఫోన్ ధర ఎంతంటే..
మహేశ్ బాబు తీసుకున్న కొత్త మొబైల్ ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర మన దేశంలో అయితే రూ. 1, 39, 990గా ఉంది. అంటే సుమారు రూ. లక్షన్నర అన్నమాట. అలాగే ఈ మొబైల్ సిరీస్ లో 128 జీబీ నుంచి 1 టీబీ వరకు రకరకాల వేరియంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మహేశ్ బాబు ప్రస్తుతం తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

12 ఏళ్ల తర్వాత..
అతడు, ఖలేజా తర్వాత 12 ఏళ్ల సుధీర్ఘ బ్రేక్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోంది. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని సమాచారం. బస్ లతో భారీ ఫైట్స్ తెరకెక్కిస్తున్నారట.


Click it and Unblock the Notifications











