Mahesh Babu: అభిమానులకు బహిరంగ లేఖ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాపై కీలకమైన అప్డేట్!
మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మొత్తానికి విడుదలకు అన్ని పనులను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగనుంది. ఇక ఈ వేడుకకు మహేష్ రాకపై కొన్ని అనుమానాలు షాక్ ఇస్తున్నాయి. ఇక మొత్తానికి మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ పై కూడా ఒక క్లారిటీ ఇస్తూ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

రెండేళ్ల గ్యాప్
మహేష్ బాబు కెరీర్ లో కరోనా కారణంగా కెరీర్ లో వెండితెరకు చాలా ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో ఖలేజా సినిమా కారణంగా దాదాపు ఏడాదిన్నర సినిమా రిలీజ్ లేకుండా ఉన్న మహేష్ మళ్ళీ ఆ తరువాత ఆ గ్యాప్ రానివ్వకుండా చూసుకున్నప్పటికి కరోనా వలన రెండేళ్లు వెండితెరకు దూరమయ్యారు.

పాజిటివ్ వైబ్రేషన్స్
2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ కొట్టిన మహేష్ మళ్ళీ ఇన్నాళ్లకు సరిలేరు నీకెవ్వరు సినిమాతో వస్తున్నాడు. ఇక ఈ సినిమా పాటలు ట్రైలర్ ఇంటర్వ్యూలు ఇప్పటికే ఇంటర్నెట్ ప్రపంచంలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు చాలా నమ్మకంతో ఉన్నారు.

మహేష్ రావడం లేదా?
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లోని యూసుఫ్ గుడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా త్రివిక్రమ్ రాజమౌళి వస్తారని తెలుస్తోంది. ఇక మరోవైపు మహేష్ బాబు రాకపై కూడా కొన్ని అనుమానాలు అయితే అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. మహేష్ రావడం లేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

బహిరంగ లేఖ
ఇక మహేష్ బాబు ఉ ఒక బహిరంగ లేఖ ద్వారా సర్కారు వారిపట్ల సినిమాపై అలాగే తన తదుపరి సినిమాపై కూడా స్పందించాడు. సర్కారు వారి పాట సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోందని ఈ సినిమాను చూసి థియేటర్లలో ఎంజాయ్ చేసే మీ స్పందన తెలియజేయగలరు అని మహేష్ బాబు సర్కారు వారి పాట గురించి తెలియజేశాడు.

త్రివిక్రమ్ తో మూవీ..
అయితే మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు మహేష్ బాబు మొదటి సారి అఫిషియల్ గా స్పందించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లోనే మొదలు కాబోతున్న ట్లుగా కూడా మహేష్ బాబు ఆ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో మహేష్ బాబు రాజమౌళితో కూడా మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











