పదేళ్ల తరువాత మహేష్ బాబు సినిమాపై ఎఫెక్ట్.. అప్పుడు ఖలేజా.. ఇప్పుడు SVP!
సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు సేఫ్ జోన్ లోనే హిట్స్ కొట్టడానికి ట్రై చేస్తుంటారని అందరికి తెలిసిన విషయమే. ఇక తన కెరీర్ లో ప్లాప్స్ వస్తే ఏ మాత్రం తట్టుకోలేనని మహేష్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక కెరీర్ లో కొన్ని అపజయాల కారణంగా ఈ హీరో చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఇకపోతే చాలా రోజుల తరువాత అనుకోని విదంగా మహేష్ వెండితెరకు చాలా గ్యాప్ ఇవ్వాల్సి వస్తోంది.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్ బాబు నెక్స్ట్ సినిమాతో కూడా మంచి హిట్ అందుకోవాలని స్పీడ్ గా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకున్నాడు. డైరెక్టర్ పరశురామ్ తో సర్కారు వారి పాట (SVP) అనే సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇక సినిమా వెండితెరపైకి రావడానికి మరో ఏడాది సమయం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అంటే మహేష్ బాబు కెరీర్ లో మరో లాంగెస్ట్ బ్రేక్ ఇదే. 2007లో భారీ అంచనాలతో విడుదలైన అతిధి సినిమా ప్లాప్ కావడంతో మహేష్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. అనుకోని విధంగా ఆ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ 2010లో ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. ఇక ఆ తరువాత మళ్ళీ మహేష్ ఏడాది గ్యాప్ కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా SVP సినిమాకు బ్రేక్ తీసుకోక తప్పడం లేదు.


Click it and Unblock the Notifications











