సైలెంట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్.. మహేష్ లుక్ లీక్!
మహర్షి సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న మహేష్ బాబు తన తదుపరి సినిమాను మొదలు పెట్టేశాడు. మహేష్ బాబు కెరీర్‌లో 26 వ సినిమాగా రానున్న ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కంఫర్మ్ చేశారు. చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 సినిమాతో సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో భాగంగా కాశ్మీర్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కాగా తాజాగా ఈ సెట్స్‌పై ఆర్మీ డ్రెస్‌లో ఉన్న మహేష్ బాబు పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్‌లో భాగంగా ఆర్మీ డ్రెస్ ధరించి ఇతర నటీనటులతో ముచ్చటిస్తూ యమ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు మహేష్. ఆయన పక్కనే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు సెట్స్ నుంచి లీకైన ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది.

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. మహేష్ కోసం మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. మహేష్ బాబును పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తూనే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











