రాజమౌళి మూవీతో టాలీవుడ్‌కు రెండేళ్లు దూరం.. ఫ్యాన్స్ కోసం మహేష్ బంపర్ ప్లాన్ ఏమిటో తెలుసా?
గుంటూరు కారం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్యాన్ వరల్డ్ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్వకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం తన అభిమానులకు కనీసం రెండేళ్లు దూరంగా ఉండబోతున్నాడు.
ఇక రాజమౌళి సినిమా మొదలైందంటే.. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం సాహసం చేస్తున్న మహేష్ రెండు సంవత్సరాలు తన అభిమానుల కోసం భారీ ప్లాన్ చేస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబు, ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్టు సిద్దమవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అయితే సెట్స్ పైకి వెళ్లే సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ వేస్తారో అనేది చెప్పడం కష్టమే అనేది పలు సినిమాలు నిరూపించాయి.
అయితే జక్కన రూపొందించే అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం భారీ కసరత్తు జరుగుతున్నది. ఈ సినిమాలో లుక్ కోసం ఇప్పటికే చాలా గెటప్స్, షూట్స్ జరిగాయి. అయితే ఇంకా ఈ సినిమాపై క్లారిటీ పూర్తిగా బయటకు రావడం లేదు. అయితే జపాన్ పర్యటనలో ఉన్న రాజమౌళి తన సినిమాలో మహేష్ బాబు అని అధికారికంగా ప్రకటించారు.
అయితే గుంటూరు కారం సినిమాతో జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ వచ్చే సంక్రాంతికి మూవీని తీసుకు రావడమనేది అసాధ్యమనే చెప్పాలి. అయితే ఓ స్టార్ హీరో రెండేళ్లుగా అభిమానులు దూరంగా ఉంటే.. ఆయన స్టార్ డమ్, ఫాలోయింగ్‌ను మెయింటెన్ చేయడం కష్టంగా మారే ప్రమాదం ఉంది. ఆ ముప్పును పసిగట్టిన ఆయన తన అభిమానులతో ఇటీవల చర్చలు జరిపారు.
అయితే వచ్చే రెండేళ్లు తన సినిమా ఉండదనే విషయంపై మహేష్ బాబు అభిమానులతో చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. అయితే రెండేళ్లు సినిమా లేని కారణంగా తాను నటించిన సినిమాలకు సంబంధించిన హిట్ చిత్రాలను రీరిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను హ్యపీగా ఉంచుదాం అని మహేష్ ఓ ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. దాంతో వచ్చే రెండేళ్లలో సూపర్ స్టార్ రిరిలీజ్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











